మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు.. అసాధారణ పాత్రలతో ఆయన అలరించారు. అవార్డులు, రివార్డులు ఎన్నో సాధించారు. మలయాళంలో ఆయనే బిగ్గెస్ట్ హీరో. ఎన్నో రికార్డులు ఆయన పేరు మీద ఉన్నాయి. ఇంత ఘన చరిత్ర ఉన్న మోహన్ లాల్.. ఇప్పుడు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బరోజ్’ క్రిస్మస్ కానుకగా విడుదలవుతోంది.
ఐతే ఈ చిత్రాన్ని మొదలుపెట్టినపుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. లాల్ లాంటి గొప్ప నటుడు దర్శకత్వం చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది కూడా. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా.. భారీ బడ్జెట్ పెట్టారు.. విజువల్ వండర్ లాగా తీర్చిదిద్దారు. పైగా ఈ సినిమా త్రీడీలో తెరకెక్కింది. ఇందులో చాలామంది విదేశీ ఆర్టిస్టులు కూడా నటించారు. ఇన్ని ప్రత్యేకతలున్న సినిమా రిలీజవుతుంటే.. పెద్దగా సౌండ్ లేదు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ‘బరోజ్’ను విడుదల చేస్తున్నారు.
తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేస్తోంది. కానీ సినిమా మొదలైనపుడు ఉన్న బజ్.. రిలీజవుతున్నపుడు లేదు. రిలీజ్ ముంగిట దీన్ని సరిగా ప్రమోట్ చేయడంలో చిత్ర బృందం విఫలమైంది. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి పెద్ద సినిమా ఒకటి రిలీజవుతున్న సంగతే తెలియట్లేదు. ఇలాంటి విజువల్ గ్రాండియర్ ఉన్న సినిమాల పట్ల తెలుగు ప్రేక్షకులకు బాగానే ఆసక్తి ఉంటుంది. సరిగా ప్రమోట్ చేస్తే దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చేవి.
గత వీకెండ్లో వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడం కూడా దీనికి ప్లస్సే. మరి రిలీజ్ రోజు స్పందన ఎలా ఉంటుందో చూడాలి. దీంతో పాటుగా ఈ వారం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, మ్యాక్స్ చిత్రాలు కూడా రిలీజవుతున్నాయి. ‘బరోజ్’ చిత్రాన్ని మోహన్ లాల్ ‘గార్డియన్ ఆఫ్ ద గామాస్ ట్రెజర్’ అనే నవల ఆధారంగా తెరకెక్కించాడు. వాస్కోడిగామాలో దాగి ఉన్న రహస్య నిధికి బరోజ్ రక్షకుడు. అతను ఆ సంపదను దుండగుల నుంచి కాపాడి నిజమైన వారసుడికి ఎలా అందించాడన్నది కథ.
This post was last modified on December 23, 2024 3:32 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…