Movie News

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ చిత్రం రూ.700 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. అయితే ఈ వ‌సూళ్లు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌కు సంతృప్తినివ్వ‌లేద‌ట‌. ఈ సినిమా సాధించిన ఫ‌లితం మీద తాను అసంతృప్తిగానే ఉన్న‌ట్లు ఒక ఇంట‌ర్వ్యూలో ప్ర‌శాంత్ వ్యాఖ్యానించ‌డం విశేషం. ద‌ర్శ‌కుడిగా ప్ర‌శాంత్ తొలి చిత్రం ఉగ్రం క‌థ‌నే కొంచెం పెద్ద స్కేల్లో స‌లార్‌గా తీశాడు ప్ర‌శాంత్.

ఉగ్రం సినిమాకు ఆశించిన క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం ద‌క్క‌లేద‌న్న ఉద్దేశంతో దాన్ని మ‌రింత మందికి రీచ్ చేయాల‌న్న ఉద్దేశంతో ప్ర‌భాస్ హీరోగా పెద్ద కాన్వాస్‌లో ఈ సినిమా తీశాడు. ఈ నేప‌థ్యంలో స‌లార్ ఫ‌లితంతో సంతృప్తి చెందారా.. ఈ క‌థ అంద‌రికీ రీచ్ అయింద‌ని భావిస్తున్నారా అని అడిగితే ఒకింత నిరాశ‌ను వ్య‌క్తం చేశాడు ప్ర‌శాంత్. తాను స‌లార్ సినిమా కోసం ప‌డ్డ క‌ష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ సినిమా రిజ‌ల్ట్ విష‌యంలో కొంత నిరాశ చెందాన‌ని ప్ర‌శాంత్ తెలిపాడు.

ఈ సినిమా ఇంకా బాగా ఆడాల్సింద‌న్నాడు. ఐతే కేజీఎఫ్-2 సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చి స‌లార్ సినిమా తీసే విష‌యంలో కొంత ఉదాసీనంగా ఉన్నానేమో అని కూడా ప్ర‌శాంత్ వ్యాఖ్యానించాడు. ఐతే స‌లార్-2 విష‌యంలో మాత్రం అభిమానులు ఎంత‌మాత్రం నిరాశ చెందొద్దని అత‌ను భ‌రోసా ఇచ్చాడు. ఆ సినిమా స్క్రిప్టు విష‌యంలో ఎంతో క‌స‌ర‌త్తు చేస్తున్నట్లు తెలిపాడు. ఆ సినిమాకు రైటింగ్ వేరే లెవెల్లో ఉంటుంద‌ని.. త‌న కెరీర్లోనే బెస్ట్ వ‌ర్క్‌గా దాన్ని చెప్పొచ్చ‌ని ప్ర‌శాంత్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

స‌లార్-2 స్టోరీ, దాని కాన్వాస్ అన్నీ కూడా వేరే స్థాయిలో ఉంటాయ‌ని ప్ర‌శాంత్ తెలిపాడు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో చేయ‌బోయే సినిమాకు ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌య్యాక 2026లో స‌లార్‌-2ను ప‌ట్టాలెక్కించే అవ‌కాశ‌ముంది. ఫ‌స్ట్ పార్ట్‌ను సీజ్ ఫైర్ పేరుతో తెర‌కెక్కించిన ప్ర‌శాంత్.. సెకండ్ పార్ట్‌ను శౌర్యాంగ ప‌ర్వం పేరుతో రూపొందించ‌నున్నాడు.

This post was last modified on December 22, 2024 10:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెండు వారాల ఉత్సాహం.. మళ్లీ నీరసం

టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్‌లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై…

55 minutes ago

పాక్ – భారత్ వివాదం.. చైనా+అమెరికా విషపు ఆలోచన!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…

3 hours ago

వారి గురుంచి ఆరా తీస్తున్న జ‌గ‌న్‌

వైసీపీ హ‌యాంలో ప‌దవులు ద‌క్కించుకున్న‌ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెల‌కు 3 ల‌క్ష‌ల‌కు పైగానే వేత‌నాల రూపంలో…

4 hours ago

‘తమ్ముడు’కి ఎన్నెన్ని కష్టాలో…

నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…

4 hours ago

ఓజీకే ఊగిపోతుంటే.. ఉస్తాద్‌ కూడానట

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…

4 hours ago

సినీ పితామహుడుగా జూనియర్ ఎన్టీఆర్ ?

ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…

5 hours ago