ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరు పరారయ్యారు. మొత్తంగా జూబ్లీ హిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసం వద్ద.. తీవ్ర ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. మరోవైపు.. ఐకాన్ స్టార్ బౌన్సర్ల వ్యవహారంపైనా కూడా.. పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై కమిషనర్ ఆనంద్ సంచలన ప్రకటన చేశారు.
మొత్తంగా అల్లు అర్జున్ కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం సాయం త్రం 5 గంటల తర్వాత.. మొత్తం సీన్ మారిపోయినట్టు స్ఫష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు నాయకులు మాత్రమే స్పందించారు. ఇదే సమయంలో డీజీపీ జితేంద్ర స్పందించారు. అయితే.. ఇక, అప్పటి నుంచి పరిణామాలు చాలా వేగంగా మారాయి. ఓ సంఘం ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో.. అల్లు నివాసంపైకి దూసుకువచ్చారు.
సంధ్య థియేటర్‌లో తోపులాట ఘటనకు, మహిళ రేవతి మృతికి, చిన్నారు శ్రీతేజ్ ఆసుపత్రి పాలుకావడానికి అల్లు అర్జునే కారణమని వారు ఆరోపించారు. అర్జున్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ఇంటి లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించగా బౌన్సర్లు అడ్డుకున్నారు. కొందరు నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు. రేవతి చావుకు అల్లు అర్జున్ కారణమని పెద్ద ఎత్తున నినదించారు. రేవతి కుటుంబానికి తక్షణమే కోటి రూపాయలు సాయం చేయాలని వారు డిమాండ్ చేయడం గమగనార్హం.
కాగా, ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. మరోవైపు.. బౌన్సర్‌లను ఉద్దేశించి సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. వారేమీ.. యోధులు కారన్నారు. ప్రజలను గౌరవించాలని. ఎవరిపైనా దూకుడు ప్రదర్శించేందుకు అవకాశం లేదని.. వారికి కొన్ని హద్దులు ఉన్నాయని స్పష్టం చేశారు. హద్దులు దాటితే.. చట్ట ప్రకారం బౌన్సర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సంధ్య ధియేటర్ ఘటనలో ప్రేక్షకులను తోసేసి, బూతులు తిట్టిన విషయం తమ పరిశీలనలో ఉందన్నారు.
This post was last modified on December 22, 2024 6:59 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…