తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా తక్కువగానే మాట్లాడతాడు. స్టేజ్‌ల మీద పంచులు విసరడం.. సెటైర్లు వేయడం తక్కువే. అలాంటి వాడు దిల్ రాజు మీద భలే పంచ్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. చరణ్ కొత్త చిత్రం ‘గేమ్ చేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అమెరికాలో తెలుగు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లు చేయడం కొత్తేమీ కాదు కానీ.. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్లుగా భారీ స్థాయిలో ఇంత పెద్ద ఈవెంట్ చేయడం మాత్రం ఇదే తొలిసారి.
ఈ వేడుకకు రామ్ చరణే ప్రత్యేక ఆకర్షణగా మారాడు. తన ఎంట్రీ, స్పీచ్ అన్నీ కూడా అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. తన ప్రసంగంలో చరణ్.. నిర్మాత దిల్ రాజును అనుకరించడం హైలైట్‌గా మారింది. సంగీత దర్శకుడు తమన్ గురించి మాట్లాడుతూ.. ఈసారి రాజు జోక్యం లేకుండా తమన్ తను చేయాలనుకున్నది చేశాడంటూ సరదాగా వ్యాఖ్యానించాడు చరణ్. అంతటితో ఆగకుండా రాజును అనుకరించాడు. సినిమాలో ఏం కావాలో అన్నీ ఇరుక్కు అంటూ.. ఇంతేనా రాజు గారూ అన్నాడు.
రాజు దగ్గరికి వచ్చి మాట సాయం అందిస్తుంటే.. సినిమాలో ఫైట్ కావాలంటే ఫైట్ ఇరుక్కు, సాంగ్ కావాలంటే సాంగ్ ఇరుక్కు.. ఇంకా ఏం కావాలో అన్నీ ఇరుక్కు అంటూ చరణ్ నవ్వేశాడు. రెండేళ్ల కిందట తాను నిర్మించిన తమిళ చిత్రం ‘వారిసు’ ఆడియో వేడుకలో దిల్ రాజు తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆ సందర్భంగా సాంగ్ వేనుమా సాంగ్ ఇరుక్కు, ఫైట్ వేనుమా ఫైట్ ఇరుక్కు.. ఎల్లా ఇరుక్కు అంటూ ఆయన చేసిన ప్రసంగం అందరినీ నవ్వించింది. సోషల్ మీడియాలో ఆ స్పీచ్ బాగా పాపులర్ అయింది. దీని మీద ట్రోల్స్ కూడా వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే రామ్ చరణ్ కూడా.. దిల్ రాజును సరదాగా ఆటపట్టించే ప్రయత్నం చేశాడు.
This post was last modified on December 22, 2024 6:28 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…