అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర యుఐ రూపంలో తెలుగులో ఏమో కానీ కన్నడలో మాత్రం బ్లాక్ బస్టర్ అందుకునేలా ఉన్నారు. అలాని ఇక్కడ వసూళ్లు మరీ తీసికట్టుగా ఏం లేవు. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీలు నమోదమవుతున్నాయి. ఇంతమంది విచిత్రంగా మాట్లాడుకునేంతగా యుఐలో ఏముందో తెలుసుకోవడం కోసం థియేటర్లకు వెళ్తున్న ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు. బుక్ మై షోలో యుఐ అన్ని భాషలు కలిపి శాండల్ వుడ్ గతంలో నమోదు చేసిన దర్శన్ కాటేరా రికార్డుని దాటేసింది.
ఇప్పుడో కొత్త ట్విస్టు ఏంటంటే ఉపేంద్ర సోమవారం లేదా మరో రెండు మూడు రోజుల్లో సెకండాఫ్ ని ఫస్ట్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ ని సెకండాఫ్ కి మార్చేసి కొత్త వెర్షన్ చూపించబోతున్నారని బెంగళూరు టాక్. అంటే అచ్చంగా రివర్స్ గేమ్ అన్న మాట. నిజంగా అన్నంత పని చేస్తారా అంటే ఏమో చేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. సామాజిక పరిస్థితుల మీద సెటైర్లు వేసిన ఉపేంద్ర కంటెంట్ ని అర్థం చేసుకోవడం కామన్ ఆడియన్స్ వల్ల కావడం లేదు. కానీ కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. పక్కరాష్టాల్లోని కొన్ని చోట్ల అదే రోజు ఇతర సినిమాలకు కేటాయించిన స్క్రీన్లు మార్చి యుఐకి ఇవ్వడం మరో మలుపు.
చివరికి ఉపేంద్ర ఎలాంటి ఫలితం అందుకుంటారో కానీ తెలుగు రాష్ట్రాల్లో స్పందన పెరిగే అవకాశాలు చూసి సక్సెస్ టూర్లు మొదలుపెడుతున్నారు. అయినా యుఐ లాంటి ప్రయోగాలు అందరు చేసేవి కాదు. అందులోనూ యునానిమస్ గా అటు పాజిటివ్ ఇటు నెగటివ్ రెండూ అనిపించుకోకుండా మధ్యలో ఊగిసలాడే టాక్ తెచ్చుకోవడం కూడా ఆయనకే చెల్లింది. పైగా సినిమాను అర్థం చేసుకోవాలంటే డీ కోడ్ చేసుకోండి, మీరు తెలివైన వాళ్లయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి, మూర్ఖులైతే ఉండిపోండి అని కార్డు వేయడం ఉపేంద్రకు మాత్రమే సాధ్యం. మరి రివర్స్ గేమ్ విషయంలో ఏం చేస్తారో.
This post was last modified on December 22, 2024 3:17 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…