పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు సంబంధించిన వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్టు, తదనంతర పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం అసెంబ్లీలో సైతం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ బన్నీ మీద తీవ్ర ఆరోపణలే చేశారు. దీనికి బదులుగా ప్రెస్ మీట్ పెట్టి బన్నీ వివరణ ఇచ్చుకున్నాడు.
తన మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమంటూ ఖండించాడు. ఐతే రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ చేసిన ఆరోపణల్లో నిజమెంత.. ఆ తర్వాత బన్నీ ఇచ్చిన వివరణలో వాస్తవాలెంత.. ఇరు వర్గాల్లో ఎవరి వాదన సమర్థంగా ఉంది అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఐతే రెండు వర్గాల వ్యాఖ్యల్లోనూ కొన్ని తప్పులు కనిపిస్తున్నాయి. బన్నీ ప్రెస్ మీట్ సందర్భంగా చేసిన ఓ కామెంట్ అతడికి తీవ్ర ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. తాను పుష్ప-2 చూసేందుకు సంధ్య థియేటర్లోకి వెళ్లాక.. జనసందోహం ఎక్కువైందని, అదుపు చేయలేని పరిస్థితి ఉందని తన టీం సభ్యులు చెప్పడంతో సినిమా మొదలైన కాసేపటికే అక్కడ్నుంచి వెళ్లిపోయినట్లు బన్నీ వెల్లడించాడు.
కానీ అతను సినిమా ఆరంభానికి ముందు వచ్చి రెండు గంటలకు పైగా అక్కడున్నట్లు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. బన్నీని థియేటర్లో చూసిన ఆనందంలో అభిమానులు ఆ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలే ఇందుకు ఆధారం. బన్నీ ఓపెనింగ్ సీన్లో థియేటర్లో ఉన్నాడు. అలాగే జాతర సీన్ సమయంలో కూడా అక్కడే ఉన్నాడు. అంటే రెండు గంటలకు పైగా బన్నీ థియేటర్లో ఉన్న మాట నిజమని తేలిపోయింది. దీంతో అతడి వాదన వీగిపోయింది.
ఇదిలా ఉంటే బన్నీ థియేటర్లో ఉండగానే అతడికి తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం తెలిసినా అక్కడ్నుంచి కదల్లేదని రేవంత్ రెడ్డి అంటే.. మహిళ చనిపోతే తన సినిమా హిట్ అని బన్నీ వ్యాఖ్యానించాడని అక్బరుద్దీన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. కానీ తన భార్య చనిపోయిన విషయం తనకు అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తెలిసినట్లు మృతురాలి భర్త మీడియాకు గతంలో వెల్లడించారు. భర్తకే ఆ విషయం అప్పుడు తెలిసినపుడు సినిమా మధ్యలో బన్నీకి ఈ విషయం ఎలా తెలుస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. దీన్ని బట్టి ఇరు వర్గాల వాదనల్లోనూ సరైన బలం లేదని అర్థమవుతోంది.
This post was last modified on December 22, 2024 2:35 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…