ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర విజయాన్ని ఆస్వాదించి వార్ 2 పూర్తి చేసుకునే పనిలో పడ్డ తారక్ జనవరి లేదా ఫిబ్రవరి నుంచి నీల్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న ఈ సినిమా విడుదలని 2026 జనవరికి ప్రకటించారు. అప్పటికి మాట మీద ఉంటారా అంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కానీ తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఏ జానరనే దాని గురించి కొంచెం సస్పెన్స్ వీడింది.
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మొదటి యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా నీల్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. గతంలో తాను చేయాలనుకున్న మైథలాజికల్ కథ కాదని, పీరియాడిక్ సెటప్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అంటే సలార్ తరహాలో ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్ యాక్షన్ డ్రామాని చూడొచ్చన్న మాట. ఇంతకన్నా విశేషాలు పంచుకోలేదు కానీ ఇది చెబుతున్నపుడు నీల్ కాన్ఫిడెన్స్ బాగా కనిపించింది. క్యాస్టింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ లాక్ కావడం దాదాపు పక్కానే. టైం చూసుకుని అఫీషియల్ చేస్తారని సమాచారం.
మరి సలార్ 2 శౌర్యంగపర్వం ఎప్పుడు ఉంటుందనే డెడ్ లైన్ ప్రశాంత్ నీల్ చెప్పకపోయినా మొదటిభాగంలో వదిలేసిన ఎన్నో ప్రశ్నలకు ఊహించని సమాధానాలు దొరుకుతాయని అంటున్నారు. ఎంతలేదన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సుమారు ఏడాది పట్టేలా ఉంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. వార్ 2 చివరి దశలో ఉన్న తారక్ నీల్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నాడు. ఇలాంటి పవర్ హౌస్ ని కెజిఎఫ్ దర్శకుడు ఏ రేంజ్ లో చూపిస్తాడానే ఆసక్తి అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ విపరీతంగా ఉంది. కంటెంట్ సరిగ్గా కుదిరితే మాత్రం రికార్డులు బద్దలు కావడం ఖాయమే.
This post was last modified on December 22, 2024 2:30 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…