అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన, జరుగుతున్న కొన్ని సంఘటనలు సినిమాలో చూస్తారని, అవి ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా చప్పట్లు కూడా కొట్టిస్తాయని చెప్పడం ఒక్కసారిగా అంచనాలను మరింత పెంచేసింది. అవి ఏంటనేది చెప్పలేదు కానీ ఇవి నాలుగేళ్ల క్రితమే దర్శకుడు శంకర్ రాసుకున్నారని, ఇప్పుడవి నిజం కావడం థ్రిల్ ఇస్తుందనే తరహాలో హింట్స్ ఇవ్వడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీస్తున్నాయి. ఎవరికి తమకు తోచిన కోణంలో గత కొన్నేళ్లలో జరిగిన కీలక ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు.
శంకర్ వర్తమాన పరిస్థితులను సినిమాల్లో చూపించడం కొత్త కాదు. జెంటిల్ మెన్ లో విద్యాశాఖ అవినీతి, ఒకే ఒక్కడులో కరప్షన్ ముఖ్యమంత్రి, భారతీయుడులో లంచగొండితనం, ప్రేమికుడులో దుర్మార్గ గవర్నర్ ఇలా ఎన్నో టచ్ చేశారు. కొన్ని వివాదాలు అయినా ప్రేక్షకులు వాటిని విపరీతంగా ఆదరించారు. తన స్కూల్ ని పక్కనపెట్టి చేసిన బాయ్స్, ఐ లాంటివి మాత్రమే ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రోబో ఒకటే ఇండస్ట్రీ హిట్టయ్యింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ రూపంలో మరోసారి వింటేజ్ శంకర్ ని చూడొచ్చన్న మాట. దిల్ రాజు అంత ప్రత్యేకంగా అన్న మాటల్లోని ప్రధాన అంతరార్థం ఇదే.
ఏదైతేనేం శంకర్, చరణ్ ఫ్యాన్స్ కోరుకున్న అంశాలైతే గేమ్ ఛేంజర్ లో ఉన్నాయనే క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ 2 గాయం నుంచి ఇది ఖచ్చితంగా బయటపడేస్తుందనే ధీమా శంకర్ లో కనిపిస్తోంది. పైగా ఇది సక్సెస్ అయితే ఇండియన్ 3 మీద కూడా హైప్ వచ్చేస్తుంది. వచ్చే వారం ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేస్తున్నారు. 27న హైదరాబాద్ లో ఉండొచ్చని సమాచారం. మరో ఈవెంట్ రాజమండ్రిలో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అతిథిగా ఎక్కడనేది ఇంకో రెండు మూడు రోజుల్లో తేలనుంది. పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ తర్వాత భారీ బిజినెస్ తో టాలీవుడ్ నుంచి వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఇదే.
This post was last modified on December 22, 2024 12:08 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…