బిగ్‍బాస్ హౌస్‍లోకి అరవై ఏళ్లు పైబడ్డ గంగవ్వను పంపించినపుడే ఆమెను కొన్ని వారాలు వుంచి పంపించేస్తారని చాలా మంది గెస్ చేసారు. ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నపుడే మినిమమ్ అయిదు వారాలు వుండాలని చెప్పారు. ఆమె వల్ల ఈ షోని ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు రూరల్ ఆడియన్స్ కూడా చూస్తారని బిగ్‍బాస్ టీమ్ ఎత్తు వేసింది. అందుకే ఆమె ఈ షోకి అసలు సూటవదని తెలిసినా కానీ ఆమెకు ఇల్లు కట్టిస్తామనే ఎర చూపించి లోనికి పంపించింది.
కానీ రెండు వారాలకే ఆమెకి ఇంటి మీద, ఊరి మీద బెంగ తిరిగిపోయింది. దాంతో ఆమెకు మందులు ఇచ్చి, వైద్యం చేయించి కాస్త ఉత్సాహాన్ని నింపి మరికొన్నాళ్లు ఉండేట్టు చూసుకున్నారు. దణ్ణాలు పెట్టి వెళ్లిపోతానని చెప్పినా పంపకుండా తమ కాంట్రాక్ట్ ప్రకారం అయిదు వారాల పాటు ఆమెని వుంచేసారు.
రోజులు లెక్కపెట్టిన గంగవ్వ నెల గడిచే సరికి ఇక వుండలేనని చెప్పేయడంతో ఆమెను బుజ్జగించడం మానేసి బయటకు పంపారు. ప్రైజ్ కొడితే ఇల్లు కట్టించుకుందామని అనుకున్న గంగవ్వకు ఇల్లు కట్టించే పూచీ నాదని నాగార్జున మాట ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయిదు వారాల పాటు తన రెక్కలు తెంచి నాలుగు గోడల మధ్య పడేసినా కానీ మొత్తానికి గంగవ్వ కల ఫలించింది. గత సీజన్లో ట్రాన్స్జెండర్ తమన్నా, ఈ సీజన్లో గంగవ్వ మాదిరిగా ఇక ఎక్స్పెరిమెంట్లు చేయకపోతే మంచిదని బిగ్‍బాస్ ఫాలోవర్స్ గట్టిగా చెబుతున్నారు.
This post was last modified on October 11, 2020 4:14 pm
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…