Movie News

కోటీ 15 ల‌క్ష‌ల‌ను వ‌డ్డీతో క‌ట్టాల‌ని.. రాం గోపాల్ వ‌ర్మ‌కు నోటీసులు!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ‌కు ఏపీ ఫైబ‌ర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వ‌డ్డీతో స‌హా చెల్లించాల‌ని ఆయ‌న‌కు స్ప‌ష్టం చేసింది. ఈ మొత్తాన్ని మూడు సంవ‌త్స‌రాల‌కు వ‌డ్డీతో క‌లిపి త‌క్ష‌ణం ఏపీ ప్ర‌భుత్వ ఖాతాకు జ‌మ చేయాల‌ని నోటీసుల్లో స్ప‌ష్టం చేసింది. దీంతో వ‌ర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌కు అనుకూలంగా ద‌ర్శ‌కుడు వ‌ర్మ వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు `వ్యూహం`, `శ‌ప‌థం` సినిమాలు తీశారు. అయితే.. ఇవి ప్ర‌జ‌ల‌కు పెద్ద గా ఎక్క‌లేదు. దీంతో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే ఏపీ ఫైబ‌ర్ నెట్ ద్వారా.. ఈ రెండు సినిమాల‌ను విడుద‌ల చేశారు. అప్పుడు కూడా.. వాటిని పెద్ద‌గా ఎవ‌రూ చూడ‌లేదు. కేవలం 1800 మంది మాత్ర‌మే చూశారు. అయితే.. ఇలా సినిమాలు ఫైబ‌ర్ నెట్‌లో విడుద‌ల చేసినందుకు ప్ర‌భుత్వం వ‌ర్మ‌కు సొమ్ములు చెల్లించింది.

ఇది కోటీ 15 ల‌క్ష‌ల రూపాయ‌లుగా ఉంద‌ని.. తాజాగా ఫైబర్ నెట్ కొత్త చైర్మన్ జీ వీ రెడ్డి ప్రకటించారు. వాస్త‌వానికి ఈ రెండు సినిమాల‌కు సంబంధించి ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం.. ఒక వ్యూ(అంటే ఒక‌రు చూస్తే) 100 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంది. కానీ, 1800 మంది చూసినా.. కోటీ 15 ల‌క్షల రూపాయ‌లు చెల్లించారు. అంటే.. ఒక్కొక్క వ్యూహ‌కు 11000 చొప్పున ఇచ్చారు. ఇది ఒప్పందాన్ని తోసిపుచ్చ‌డ‌మేన‌న్న‌ది జీవీ రెడ్డి వాద‌న‌.

ఈ క్ర‌మంలో అక్ర‌మంగా తీసుకున్న ప్ర‌భుత్వ సొమ్మును తిరిగి రాబ‌ట్టేందుకు ఏపీ ఫైబ‌ర్ నెట్ ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌కు నోటీసులు జారీ చేసింది. ఈ సొమ్మును కేవ‌లం 15 రోజుల్లోనే వెన‌క్కి ఇవ్వాల‌ని ఆదేశించ‌డంతో పాటు.. ఏడాదికి 12 శాతం వ‌డ్డీని క‌లిపి ఇవ్వాల‌ని పేర్కొంది. దీని ప్ర‌కారం.. వ‌డ్డీ కింద మ‌రో 30 ల‌క్ష‌లు వ‌ర్మ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మొత్తాన్ని ఏ ప‌ద్దు కింద చెల్లించారో కూడా.. విచార‌ణ చేయిస్తామ‌ని.. నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు. అయితే.. వ‌ర్మ ఈ విష‌యాన్ని కోర్టులో తేల్చుకునే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై కేసులు ఉన్న విష‌యం తెలిసిందే.

This post was last modified on December 21, 2024 5:05 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

11 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

23 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

1 hour ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago