‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా చూసి టాలీవుడ్ నుంచి కొందరు పెద్ద స్టార్లు కూడా తనతో పని చేయడానికి ఆసక్తి చూపించారు. అతనేమో బాలీవుడ్‌కు వెళ్లిపోయి ‘అర్జున్ రెడ్డి’ని రీమేక్ చేశాడు. అది ఇంకరా పెద్ద విజయం సాధించింది. దీని తర్వాత రణబీర్ కపూర్ హీరోగా తీసిన ‘యానిమల్’ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
దీంతో దేశవ్యాప్తంగా సందీప్ పేరు మార్మోగిపోయింది. తనతో ఒక్క సినిమా చేయాలని ఆశపడే హీరోల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. ఈ జాబితాలోకి హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా వచ్చాడు. ‘కాంతార’తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న రిషబ్.. ప్రస్తుతం ‘కాంతార చాప్టర్ 1’, ‘జై హనుమాన్’, ‘ఛత్రపతి శివాజీ’ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు. ఇలాంటి లైనప్‌తో ఉండి కూడా వంగతో ఓ సినిమా చేయాలని అతను ఆశపడుతున్నాడు.
‘‘సందీప్ రెడ్డి వంగ చాలా క్రేజీగా ఆలోచిస్తారు. ఎవ్వరికీ రాని ఆలోచనలు ఆయనకు వస్తాయి. తన సినిమాలో నటించాలని ఉంది. అతను ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధం’’ అని రిషబ్ వ్యాఖ్యానించాడు. రిషబ్ కన్నడ సినిమాకు గర్వ కారణంగా మారాడు. తన భాష, తన ఇండస్ట్రీ గురించి గొప్పగా మాట్లాడుతుంటాడు. ఆత్మాభిమానంతో మాట్లాడే అలాంటి నటుడు, దర్శకుడు కూడా సందీప్ రెడ్డి సినిమాలో ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే మన డైరెక్టర్‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం రిషబ్ ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది వచ్చే ఏఢాది దసరాకు రిలీజవుతుంది. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. తన సొంత గ్రామంలోనే అతను ‘కాంతార’ సినిమా తీశాడు. అక్కడి జనాలనే ఈ చిత్రంలో నటింపజేశాడు. ఇప్పుడు కాంతార చాప్టర్ 1కు కూడా అదే లొకేషన్ ఎంచుకున్నాడు. తన గ్రామాన్ని సినిమా హబ్‌గా మార్చాలని ఉండేదని.. ఆ కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని.. మున్ముందు తన గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని రిషబ్ అన్నాడు.
This post was last modified on December 21, 2024 4:59 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…