2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహిస్తారని ఐసీసీ పేర్కొంది.
భద్రతా కారణాల వల్ల పాక్‌లో భారత జట్టు ఆడడం ఇబ్బందిగా మారడంతో, టోర్నీ నిర్వహణలో ఈ హైబ్రిడ్ విధానాన్ని ఆమోదించారు. ఇక ఇండియా పాక్ తో ఆడాలి అంటే ప్రతీ సారి దుబాయ్ లేదా ఇతర దేశాల్లో వేదిక సిద్ధం చేయాలి. పాకిస్తాన్ కూడా భారత్ లో ఆడబోమని చెప్పడంతో ఐసిసి వారికి కూడా అలంటి ఆఫరే ఇచ్చింది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు, 2026 టీ20 ప్రపంచ కప్ (భారత్, శ్రీలంక) కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగనుంది. పాక్‌కు 2028 టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులు దక్కగా, ఈ టోర్నీకి కూడా ఇదే విధానం వర్తించనుంది. భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు తమ తమ అభిప్రాయాలను ఐసీసీకి తెలియజేయగా, భారతదేశం భద్రతా సమస్యల దృష్ట్యా పాక్‌లో మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించింది.
అయితే, పాకిస్థాన్ కూడా తమ దేశంలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించాలనే షరతును పెట్టింది. దీనితో ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలని నిర్ణయించింది. ఈ పరిణామంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అగ్రదేశాలు సన్నద్ధం అవుతుండగా, భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులలో ప్రత్యేక ఉత్సాహం రేకెత్తించనున్నాయి. టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది.
This post was last modified on December 19, 2024 7:31 pm
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…