పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా విపరీతంగా ఆలస్యం కావడం మాత్రం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. క్రిష్ లాంటి మేటి దర్శకుడితో పవన్ జట్టు కట్టడం అందరినీ ఎగ్జైట్ చేసింది. కానీ సినిమా బాగా ఆలస్యం కావడంతో చివరి దశలో ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. అది చాలామందిని డిజప్పాయింట్ చేసింది.
మిగిలిన పోర్షన్ పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. అతడి కెరీర్లో ఇప్పటిదాకా హిట్ అన్నదే లేదు. చివరి చిత్రం ‘రూల్స్ రంజన్’ దారుణమైన ఫలితాన్నందుకుంది. మరి అతను తీసే మిగతా పార్ట్ ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాక తాను కూడా అందులోంచి వైదొలిగినట్లు స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
‘హరి హర వీరమల్లు’ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ప్రస్తుతం దాని అప్‌డేట్స్ గురించి చెప్పమంటే.. క్రిష్ ఈ మూవీ నుంచి తప్పుకోగానే తాను కూడా బయటికిక వచ్చేసినట్లు సాయిమాధవ్ వెల్లడించాడు. సాయిమాధవ్‌కు రచయితగా బ్రేక్ ఇచ్చింది క్రిష్‌యే. కెరీర్ ఆరంభం నుంచి ఆయనతోనే పని చేస్తూ వచ్చాడు క్రిష్. ‘హరి హర వీరమల్లు’కు కూడా ఆయనే రచన చేశారు. కానీ క్రిష్ బయటికి వచ్చాక అందులో కొనసాగలేక తాను బయటికి వచ్చేసినట్లు సాయిమాధవ్ తెలిపారు.
అలా అని ఆ ప్రాజెక్టు గురించి ఆయన నెగెటివ్‌గా ఏమీ మాట్లాడలేదు. ఈ సినిమా అద్భుతమైన సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోందని.. కథ గొప్పగా ఉంటుందని.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తాను కూడా ఎదురు చూస్తున్నానని తెలిపాడు సాయిమాధవ్. మరి క్రిష్-సాయిమాధవ్ బయటికి వచ్చేశాక స్క్రిప్టు, మేకింగ్ విషయంలో జ్యోతికృష్ణ అండ్ టీం ఏమైనా మార్పులు చేసిందా.. ఫైనల్‌గా ఈ సినిమా ఔట్ పుట్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరం. వచ్చే వేసవిలో ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on December 19, 2024 6:35 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…