మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్ ఉంటాయని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేస్తామని తాజాగా క్లారిటీ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్ళబోతున్న సందర్భంగా ఈ గుడ్ న్యూస్ పంచుకున్నారు. పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన తర్వాత ఇకపై స్పెషల్ షోలు ఉండవేమోనని ఇతర హీరోల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గతంలో ఎప్పుడూ జరగని ఘటన కావడంతో ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వ్యవహారం వెళ్ళింది.
ఒకవేళ హీరో రాకపోయి ఉంటే ఇది జరిగేది కాదనే కామెంట్ ని కొట్టిపారేయలేం. సో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లతో పాటు సంక్రాంతికి వస్తున్నాంకు సైతం ప్రీమియర్లను ఎక్స్పె క్ట్ చేయొచ్చు. దిల్ రాజు కాబట్టి పక్కా ప్లానింగ్ తో చేసుకుంటారు. పండక్కు వస్తున్న మూడు సినిమాల్లో రెండు స్వంత బ్యానర్ వే కావడం, మూడోదానికి డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల అయన మీద పెద్ద బాధ్యతలు ఉండబోతున్నాయి. పంపిణి వ్యవహారాలతో పాటు స్క్రీన్ల సర్దుబాటు తదితరాలు చాలా చూసుకోవాలి. గత సంక్రాంతిని దిల్ రాజు మిస్ అయ్యారు. గుంటూరు కారం డిస్ట్రిబ్యూట్ చేసినా భారీ లాభాలు దక్కలేదు.
సో క్లారిటీ వచ్చేసింది కాబట్టి గేమ్ ఛేంజర్ సంబరాలకు ఫ్యాన్స్ రెడీ అవ్వొచ్చు. జనవరి 10 సోలో రిలీజ్ కనక భారీ ఎత్తున స్క్రీన్ కౌంట్ దక్కనుంది. ముందు వచ్చే అడ్వాంటేజ్ ఓపెనింగ్స్ పరంగా చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. అందులోనూ వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా దర్శనం ఇవ్వలేదు. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోగా ఆచార్యలో కేవలం అతిధి పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. అందుకే గేమ్ ఛేంజర్ కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ వచ్చాక హైప్ మాములుగా పెరగదని ఇన్ సైడ్ టాక్. ఫ్యాన్స్ కి ఇప్పుడు కావాల్సింది ఆ కిక్కేగా.
This post was last modified on December 19, 2024 7:25 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…