మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోస్ట్ వాంటెడ్ సాంగ్ దోప్ రిలీజవుతుంది. ఫ్యాన్స్ సంతృప్తి పడేలాగే కంటెంట్ వదులుతూ వచ్చారు కానీ సామాన్య ప్రేక్షకుల్లోనూ ఆసక్తి అమాంతం పెరిగేలా పబ్లిసిటీ మరింత అగ్రెసివ్ చేయాల్సిన అవసరం ఉంది. దర్శకుడు శంకర్ ఫైనల్ వెర్షన్ దాదాపు లాక్ చేసినట్టు తెలిసింది. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని, రామ్ చరణ్ అన్ని విభాగాల్లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడని, ఒక కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ చూస్తారని తమిళ మీడియాతో అన్నట్టుగా సమాచారం.
ఇది బ్లాక్ బస్టర్ కావడం దిల్ రాజు, రామ్ చరణ్ కు ఎంత ముఖ్యమో శంకర్, లైకా ప్రొడక్షన్స్ కు అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే దీని ఫలితం మీద భారతీయుడు 3 హైప్ ఆధారపడి ఉంటుంది. రెండో భాగం దారుణంగా డిజాస్టర్ కావడమే కాక శంకర్ కెరీర్ లో మొదటిసారి ట్రోలింగ్ ఎదురుకోవాల్సి వచ్చింది. ఎంతగా అంటే ఇండియన్ 3 నేరుగా ఓటిటిలో వస్తుందని ప్రచారం జరిగేంత. కానీ శంకర్ మాత్రం పట్టుదలగా థియేట్రికల్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నారట. నెగటివ్ ఫీడ్ బ్యాక్ కి సమాధానం ఇచ్చేలా 2 సినిమాల అవుట్ ఫుట్ వచ్చిందని అంటున్నారట. సో సక్సెస్ కావడం ఎంత కీలకమో అర్థమయ్యిందిగా.
గేమ్ ఛేంజర్ కనక రికార్డులు కొట్టగలిగితే ఆటోమేటిక్ గా ఇండియన్ 3కి బిజినెస్ మార్గాలు తెరుచుకుంటాయి. శంకర్ మార్క్ మళ్ళీ వచ్చేసిందని బయ్యర్లు, ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలు ఇంకో వారంలో కొలిక్కి వచ్చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ అగ్రిమెంట్లు ఒక్కొక్క కేంద్రం వారిగా జరిగిపోతున్నాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, విడాముయర్చిలతో పోటీని తట్టుకుని భారీ వసూళ్లు రాబట్టుకోవల్సిన బాధ్యత గేమ్ ఛేంజర్ మీద ఉంది. సోలో హీరోగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చరణ్ చేసిన సినిమా ఇది.
This post was last modified on December 19, 2024 3:26 pm
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…