ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్ లో వదలకపోవడం సాధారణంగా అందరూ చేసేదే. ముఖ్యంగా పాటల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి. కానీ పుష్ప 2 ది రూల్ నుంచి అప్పుడే రెండు ఫుల్ వీడియో సాంగ్స్ కేవలం రెండు రోజుల గ్యాప్ లో వచ్చేశాయి. పుష్ప టైటిల్ సాంగ్ లో డిలీట్ చేసిన డాన్స్ బిట్ ఉండటం మరో ట్విస్టు. ముందు పీలింగ్స్ పీలింగ్స్ వదిలారు. ఆ తర్వాత మరొకటి. నెక్స్ట్ అసలైనవి రెండు బాకీ ఉన్నాయి. సూసేకి అగ్గిరవ్వ జాతర బ్యాక్ డ్రాప్ కాబట్టి చివర్లో ఆలస్యంగా రిలీజ్ చేయొచ్చు.
దానికన్నా ముందు కిసిక్ కిసిక్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అయితే ఇంకా మూడో వారం పూర్తి కాకుండానే ఇలా వరసగా వీడియో సాంగ్స్ వదలడం దేనికి సంకేతమోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మాములుగా ఓటిటి రిలీజ్ త్వరగా ఉన్నప్పుడే ఇలా చేస్తారు. పుష్ప 2కి నెట్ ఫ్లిక్స్ నాలుగు వారాల అగ్రిమెంట్ కోసం భారీ మొత్తం చెల్లించిందనే టాక్ ఉంది. అదే నిజమైతే జనవరి మొదటివారంలో స్ట్రీమింగ్ జరగొచ్చు. లేదూ దేవర లాగా 45 రోజుల విండో అయితే మాత్రం రిపబ్లిక్ డే కన్నా ముందు రాకపోవచ్చు. ఫ్యాన్స్ అయితే రెండో ఆప్షన్ కోరుకుంటున్నారు. కానీ ఏదీ ఖచ్చితంగా చెప్పలేం.
సంక్రాంతి నుంచి కొత్త సినిమాల తాకిడి ఉంది కాబట్టి పుష్ప 2 అప్పటికంతా నెమ్మదించేస్తుంది. పైగా నెల రోజుల రన్ పూర్తవుతుంది. సో ఒకవేళ నిజంగా నెట్ ఫ్లిక్స్ జనవరి ఫస్ట్ వీక్ వదిలితే థియేట్రికల్ గా అంత సమస్య ఉండకపోవచ్చు. లేదూ అంటే చివరి వారం ఉత్తమం. పుష్ప రాజు ఏ సంకేతం ఇస్తున్నాడో ఈ వారంలో తేలొచ్చు. హిందీ వెర్షన్ నుంచే 600 కోట్లు దాటేసిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్లను దాటేసి రెండు వేల మైలురాయి వైపు పరుగులు పెడుతున్నాడు. కాకపోతే అదంత సులభం కాదు. మనదగ్గర వీక్ డేస్ లో నెమ్మదించింది. డిసెంబర్ 20 రిలీజుల టాక్స్ ని బట్టి మార్పులు ఉంటాయి.
This post was last modified on December 18, 2024 6:39 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…