ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి జనంలో ఆసక్తి కలగడానికి కారణం పేరే. గుకేష్ పుట్టింది తెలుగు కుటుంబమే అయినా బాల్యం, చదువు మొత్తం చెన్నైలోనే జరిగాయి. ఫ్యామిలీ మూలాలు తిరుపతి జిల్లా సత్యవీడులో ఉండటం వల్ల గుకేష్ కు బహు భాషలు వచ్చు. తండ్రి వృత్తిరిత్యా డాక్టర్. టోర్నమెంట్స్ కోసం కొడుకు పలు ప్రదేశాలు తిరగాల్సి రావడంతో తనకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేయడం గుకేష్ ని ప్రపంచ విజేతగా నిలబెట్టింది. అయితే తనకు సినిమాల మీద అవగాహన ఉందండోయ్.
తెలుగులో తన ఫెవరెట్ మూవీ గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ ఇంకా టీనేజ్ లో కూడా అడుగుపెట్టని వయసులో ఉన్న గుకేష్ ని అప్పట్లోనే ఆకట్టుకుంది. తమిళంలో సూర్య సన్ అఫ్ కృష్ణన్ (వారణం ఆయిరం), హిందీలో జిందగీ నా మిలే గి దోబారా బాగా ఇష్టమట. హాలీవుడ్ మీద పెద్దగా ఇష్టం లేదు కానీ అబౌట్ టైం అనే ఇంగ్లీష్ చిత్రం నచ్చిందని అన్నాడు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముచ్చట్లు బయట పెట్టాడు. రెండు పదుల వయసు కూడా దాటని గుకేష్ కి కేవలం చెస్ లోనే కాక సినిమాల మీద కూడా ఆసక్తి ఉండటం విశేషమే.
ఇదంతా బాగానే ఉంది కానీ గుకేష్ బయోపిక్ ని తెరకెక్కించే ఆలోచన ఎవరికో ఒకరికి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందో లేదో చూసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం గుకేష్ కు 5 కోట్ల అవార్డు అందించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ట్విట్టర్ వేదికగా అందించిన శుభాకాంక్షలకు గుకేష్ స్పందిస్తూ అందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పాడు. త్వరలో హైదరాబాద్ కు రాబోతున్నట్టు సమాచారం. ఇక్కడా ఘనంగా ఒక సన్మాన కార్యక్రమం చేసే ప్లాన్ ఉందట.
This post was last modified on December 18, 2024 7:39 pm
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…