క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్ హుడ్ రిలీజ్ డేట్లను మార్చుకోవడంతో ఈ సీజన్ కొంచెం కళ తప్పింది. తెలుగు నుంచి క్రిస్మస్ బరిలో నిలిచిన ఏకైక మూవీ ‘బచ్చల మల్లి’ ఒక మోస్తరుగా క్రేజ్ తెచ్చుకుంది. దీంతో మూడు డబ్బింగ్ సినిమాలు పోటీ పడుతుండడం విశేషం. ఉపేంద్ర సినిమా ‘యుఐ’, విజయ్ సేతుపతి మూవీ ‘విడుదల-2’తో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘ముఫాసా’ వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
ఐతే యానిటమేటెడ్ మూవీ అయినా ‘ముఫాసా’ని జనం ఏం చూస్తారులే అని మిగతా చిత్రాలు లైట్ తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. డిస్నీ వాళ్లు ‘ది లయన్ కింగ్’ లైన్లోనే రూపొందించిన ‘ముఫాసా’ మీద వరల్డ్ వైడ్ మంచి బజ్ ఉంది. ఇలాంటి సినిమాలు చూడ్డానికి అమితాసక్తి చూపిస్తారు. సిటీల్లోని మల్టీప్లెక్సుల్లో ఈ తరహా సినిమాలు హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతాయి. ఐతే ‘ముఫాసా’ చిన్న టౌన్లలో కూడా బాగా ఆడితే ఆశ్చర్యమేమీ లేదు. దీనికి బుకింగ్స్ అన్ని చోట్లా బాగున్నాయి కూడా.
అందుక్కారణం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాక్టర్. ఇందులో ముఫాసా పాత్రకు మహేషే గాత్రం అందించాడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద మహేష్ కటౌట్లు పెట్టడం.. అక్కడక్కడా బెనిఫిట్ షోలు ప్లాన్ చేయడం.. ఇలా హంగామా మామూలుగా లేదు. ‘ముఫాసా’ బుకింగ్స్ జోరుగా సాగుతుండడంలో మహేష్ ఫ్యాక్టర్ కీలకంగానే కనిపిస్తోంది.
కాబట్టి జంతువుల సినిమా అని పోటీలో ఉన్న మిగతా చిత్రాలు లైట్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే క్రిస్మస్ సీజన్లో ఇండియా వైడ్ ఇదే నంబర్ వన్ మూవీగా నిలిచినా ఆశ్చర్యం లేదు. గతంలో ‘జంగిల్ బుక్’ ఇండియాలో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయాన్ని మరువరాదు.
This post was last modified on December 18, 2024 4:56 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…