ఎస్ఎస్ఎంబి 29 ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంత ఆనందపడుతున్నారో అంతకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే రాజమౌళితో వ్యవహారం మాములుగా ఉండదు. నిన్న ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ ట్రైలర్ చూశాక వాళ్ళ ఆందోళన మరింత పెరిగింది. 1 గంట 38 నిమిషాల ఈ ఎక్స్ క్లూజివ్ మేకింగ్ డాక్యుమెంటరీని కేవలం ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో డిసెంబర్ 20 విడుదల చేయబోతున్నారు. ఎన్నో మేకింగ్ విశేషాలతో పాటు తారాగణం ఇంటర్వ్యూలు, సెట్లు, విఎఫెక్స్ ఎఫెక్ట్స్, సాంకేతిక వర్గం ఎంత కష్టపడిందనే వైనం అన్నీ వివరంగా చూపిస్తారట. ఇక్కడి దాకా ఓకే.
నాటు నాటు పాటకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను జక్కన్న ఎంత హింసించాడో పలు సందర్భాల్లో ఇద్దరూ చెప్పుకోవడం అందరికీ గుర్తే. స్టెప్పుల్లో తేడా రాకుండా సింక్ కుదిరేలా ఒళ్ళు హూనం చేశాడని, అందుకే అంత గొప్పగా వచ్చి ఆస్కార్ సాధించిందని ఎవరైనా ఒప్పుకుంటారు. ఇంతకు మించిన కష్టం యాక్షన్ ఎపిసోడ్లకూ జరిగింది. సరే అక్కడంటే ఇద్దరు హీరోలు. కానీ ఈసారి మహేష్ ఒక్కడే అన్నీ చూసుకోవాలి. పైగా ఫారెస్ట్ అడ్వెంచర్. నిజం జంతువులను వాడకపోయినా రిస్కీ షాట్లు చాలా ఉంటాయి. సాహసోపేతమైన స్టంట్స్ ఎన్నో పెడతారు. ఫిట్ నెస్ ఫ్రీకీ అయిన మహేష్ బాబుకి ఇవన్నీ ఎదురుకోగలిగిన సవాళ్ళే.
జనవరిలో ప్రారంభం కాబోతున్న ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన డేట్ ఇంకా రాలేదు కానీ రాజమౌళి ప్రస్తుతం శ్రీసింహ పెళ్లిలో బిజీగా ఉన్నాడు. అది అయిపోయింది కాబట్టి ఇకపై ప్రీ ప్రొడక్షన్ మీద మరింత దృష్టి పెట్టబోతున్నాడు. రెండు భాగాలుగా మహేష్ మూవీ ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. అన్ని వివరాలు ఒక ప్రెస్ మీట్ ద్వారా మహేష్, జక్కన్న త్వరలో పంచుకోబోతున్నారు. హీరోయిన్, విలన్, ఇతర తారాగణం వివరాలకు సంబంధించి లీక్స్ వస్తున్నాయి కానీ అవెంత వరకు నిజమో అనౌన్స్ మెంట్ అయ్యేదాకా చెప్పలేం. మొదటి భాగానికే కనీసం రెండు సంవత్సరాలు పట్టొచ్చని ఒక అంచనా.
This post was last modified on December 18, 2024 11:02 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…