టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్‌లను భిన్న ధ్రువాలుగా చెప్పొచ్చు. వీళ్లిద్దరి సినిమాలను పోల్చడానికి అవకాశముండదు. ఎవరి స్టయిల్లో వాళ్లు సినిమాలు తీస్తారు. ఇద్దరి కథలు.. వాటి నరేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ల సినిమాల్లో కనిపించే ఆర్టిస్టుల విషయంలోనూ చాలా వైరుధ్యం కనిపిస్తుంటుంది.
హీరోలు, హీరోయిన్లు, లీడ్ విలన్ల సంగతి పక్కన పెడితే.. మిగతా ఆర్టిస్టుల విషయంలో చాలా తేడాలుంటాయి. ఒకరి సినిమాల్లో కనిపించే ఆర్టిస్టులు ఇంకొకరి చిత్రాల్లో కనిపించడం అరుదు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఫేవరెట్ ఆర్టిస్టుల్లో ఒకరు, అతడి మిత్రుడు కూడా అయిన సునీల్.. సుకుమార్ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ముందు అనుకున్న ఒక ఆర్టిస్టును తప్పించి మరీ సునీల్‌కు తన కొత్త చిత్రం ‘పుష్ప’లో అవకాశం కల్పించాల్సిన పరిస్థితిలో పడ్డాడట సుక్కు.
అల్లు అర్జున్ హీరోగా సుక్కు తెరకెక్కించబోయే ‘పుష్ప’ ఇంకొన్ని రోజుల్లోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. కాగా ఇప్పుడు కొన్ని పాత్రల విషయంలో ఆర్టిస్టులను మారుస్తున్నట్లు తెలిసింది. అందులో పాత్ర కోసం కొంచెం చిన్న స్థాయి క్యారెక్టర్ నటుడిని అనుకోగా.. అతణ్ని తప్పించి ఇప్పుడు ఆ స్థానంలోకి సునీల్‌ను తెస్తున్నట్లు తెలిసింది. సునీల్‌ను ఈ సినిమాకు తీసుకోవాలని బన్నీకి త్రివిక్రమ్ చెప్పగా.. అతను సుక్కుకు రెకమండ్ చేసి తనకు సినిమాలో పాత్రను ఇప్పించినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ పాత్ర సునీల్ కంటే అంతకుముందు అనుకున్న నటుడిగా బాగుంటుందట. కానీ తనకు ‘అల వైకుంఠపురములో’ లాంటి మెగా హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ కోసం బన్నీ సునీల్‌కు ఈ పాత్ర ఇప్పించాలని బన్నీ భావించాడు. బన్నీతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా సుకుమార్ కాదనలేకపోయాడట. ఇలాగే మరికొన్ని మార్పులు చేర్పులు చేసి వాటిని ఫైనలైజ్ చేసి షూటింగ్‌కు వెళ్లిపోవాలని చూస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 10, 2020 5:31 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…