వచ్చే ఏడాది ఏప్రిల్ 18 విడుదల కాబోతున్న ఘాటీ అనుష్క అభిమానులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పెర్ఫార్మన్స్ ఆధారంగా టైటిల్ రోల్స్ తను చాలా చేసింది కానీ ఇంత వయొలెంట్ గా కనిపించడం మాత్రం ఇదే తొలిసారి. ఒక మనిషి మెడనరికి అతని తలను ఎక్కడికో తీసుకెళ్లిపోవడం సాధారణంగా కమర్షియల్ స్టార్లు చేయడం చూస్తాం. అలాంటిది హీరోయిన్ అంటే చిన్న విషయం కాదు. అందులోనూ సెన్సిబుల్ కథలు డీల్ చేసే దర్శకుడు క్రిష్ నుంచి ఓవర్ ది బోర్డు హింసను ఎవరూ ఊహించలేదు. సరే ఇక్కడ పుష్పరాజ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో, కనెక్షన్ ఏంటో డీటెయిల్స్ చూస్తే అర్థమైపోతుంది.
ఘాటీలో కథా వస్తువు గంజాయి వ్యాపారం చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ టాక్. పొట్టకూటి కోసం వేరే ఊరికి వెళ్లిన యువతి అక్కడ దగాకు గురైతే అదే చోట ఎదురుతిరిగి నేర సామ్రాజ్యం మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకునే మహారాణిగా ఎదిగే పాయింట్ ని క్రిష్ తీసుకున్నారట. అంటే ఒకరకంగా చెప్పాలంటే ఒక కూలీ గా మొదలైన పుష్పరాజ్ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే మార్చే స్థాయికి ఎలా చేరుకున్నాడో ఇక్కడ ఘాటీలో కూడా అదే తరహాలో ఒక లేడీ డిక్టేటర్ ని చూపిస్తారని అంటున్నారు. టీజర్లో చూపించిన రెండు మూడు విజువల్స్ ఇంటెన్సిటీ చూస్తుంటే అది నిజమైనా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఆచితూచి సినిమాలు చేస్తున్న అనుష్క ఇప్పుడీ ఘాటీతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెడుతోంది. కెజిఎఫ్ స్ఫూర్తి కూడా ఇందులో చూడొచ్చని యూనిట్ నుంచి వినిపిస్తున్న మరో కామెంట్. దర్శకుడు క్రిష్ కి 2025 చాలా కీలకం. అధిక శాతం దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల కానుండగా ఘాటీ ఆపై ఇరవై రోజుల గ్యాప్ లో ఏప్రిల్ 18 న రిలీజవుతుంది. అంచనాల పరంగా చూస్తే రెండింటి మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం ఫలితాలు నిరాశపర్చడంతో క్రిష్ బలమైన కంబ్యాక్ వీటితో అవుతుందని అభిమానులు ధృడంగా నమ్ముతున్నారు. చూద్దాం.
This post was last modified on December 17, 2024 7:12 pm
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…