Rx 100 Director Ajay
ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. రెండేళ్ల తర్వాత కూడా తన రెండో సినిమాను మొదలుపెట్టే స్థితిలో లేడు అజయ్ భూపతి. ఇప్పుడైతే కరోనా వల్ల షూటింగులు జరిగే పరిస్థితి లేదు కానీ.. దీనికి ముందు ఏడాదిన్నర కాలంలో అతను తన సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు.
మల్టీస్టారర్ కథతో తెరకెక్కాల్సిన ఈ సినిమాకు హీరోల్ని ఖరారు చేసుకోవడంలోనే అజయ్ చాలా ఇబ్బంది పడ్డాడు. మాస్ రాజా రవితేజ సహా కొందరు హీరోల్ని ట్రై చేసి చివరికి ప్రధాన కథానాయకుడిగా శర్వానంద్‌ను ఖరారు చేశాడు.
మరో హీరో పాత్రకు హీరోను ఫైనలైజ్ చేయడంలోనూ ఆలస్యం జరిగింది. చివరికి తమిళ హీరో సిద్దార్థ్‌ను ఈ పాత్రకు ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఐతే మల్టీస్టారర్ కథ కావడం, దీనికి హీరోల్ని ఖరారు చేసుకోవడంలోనే చాలా ఆలస్యం జరగడంతో అజయ్ తీవ్ర అసహనంతో ఉన్నట్లున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇదే తొలి, చివరి మల్టీస్టారర్ అని చెప్పడం గమనార్హం. ఇలాంటి కథ రాయడం ఒకెత్తయితే.. హీరోల్ని ఒప్పించడం మరో ఎత్తు అంటూ అతను ఫ్రస్టేట్ అయ్యాడు. మొత్తానికి హీరోలైతే ఖరారయ్యారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. కాబట్టి కరోనా ప్రభావం తగ్గాక సినిమా పట్టాలెక్కడం లాంఛనమే కావచ్చు.
This post was last modified on April 29, 2020 9:48 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…