ముందు అనుకున్న ప్రకారమైతే సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న మేజిక్ ఈ నెల 21 విడుదల కావాల్సింది. అయితే ఇది రావడం లేదనే స్పష్టత ఈ నెల ప్రారంభంలోనే వచ్చింది కానీ ఎందుకు వాయిదా పడిందనే కారణాలు బయటికి రాలేదు. ఏంటయ్యా అని ఆరా తీస్తే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ 12 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మార్చి 28 రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ అదే రోజు హరిహర వీరమల్లు ఉన్న నేపథ్యంలో మార్చుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ముందైతే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఫస్ట్ కాపీతో రెడీగా ఉంటే తర్వాత తేదీ గురించి ఆలోచించవచ్చని విడి 12 టీమ్ ఆలోచిస్తోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం మేజిక్ కి ఒక పాట, నాలుగైదు రోజుల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. వీటిని మించి అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలంటే తన డేట్స్ దొరకాలి. కాపీ చేతిలో ఉంటే తప్ప చెన్నైకి వెళ్ళలేరు. అందుకే మేజిక్ పెండింగ్ లో ఉండిపోయిందని సమాచారం. దీనికన్నా ముందు మ్యాడ్ స్క్వేర్ ని వదిలే ఆలోచనలో నిర్మాత నాగవంశీ ఉన్నారట. అన్నీ కుదిరితే ఫిబ్రవరిలో దీన్ని రిలీజ్ చేస్తారు. ఒకవేళ మేజిక్ కనక మరింత ఆలస్యమయ్యే పక్షంలో 2025 వేసవి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ త్వరలోనే డిసైడ్ చేయబోతున్నారు.
మొత్తం కొత్తవాళ్ళతో తీసిన మేజిక్ పూర్తి ఫన్ అండ్ ఎమోషన్స్ తో యువతకు విపరీతంగా నచ్చేలా రూపొందుతోందట. సారా అర్జున్, అన్మోల్ కజని, ఆకాష్ శ్రీనివాస్, సిద్దార్థ్ తణుకు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ మొత్తం కాలేజీలోనే సాగుతుందట. హ్యాపీ డేస్ తరహాలో అందరికీ నచ్చే అంశాలు ఉంటాయని అంటున్నారు. గత ఏడాది ఫ్యామిలీ స్టార్ వల్ల విడి 12 ఆలస్యం కావడంతో టైం వృథా కాకుండా సితార – గౌతమ్ తిన్ననూరి కలిసి తక్కువ టైంలో మేజిక్ పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నారు. తీరా చూస్తే దీనికి కూడా జాప్యం, పోస్ట్ పోన్ తప్పలేదు.
This post was last modified on December 17, 2024 2:49 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…