Movie News

రాబిన్ హుడ్ నిర్ణయం – తమ్ముడుకి ఇరకాటం !

క్రిస్మస్ రేస్ నుంచి రాబిన్ హుడ్ తప్పుకోవడంలో ఇంకెలాంటి అనుమానాలు లేవు. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించేయడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. చివరి నిమిషం దాకా నితిన్ డిసెంబర్ 25 కోసమే పట్టుబట్టినప్పటికీ నిర్మాతలు, స్వతహాగా డిస్ట్రిబ్యూటరైన తండ్రి పరిస్థితులను వివరించి చెప్పాక వెనుకడుగుకు సిద్ధమయ్యాడట. అయితే 2025 సంక్రాంతి బరిలో దింపాలనే ప్రతిపాదన మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, విడాముయర్చిలతో తలపడటం ఎంత సేఫనే కోణంలో ప్రస్తుతం చర్చలు చేస్తున్నారని తెలిసింది.

ఇప్పుడు రాబిన్ హుడ్ ముందున్న ఆప్షన్లు రెండు. ఒకటి జనవరి చివరికి వెళ్లిపోవడం. లేదూ అంటే ఫిబ్రవరిలో శివరాత్రిని లాక్ చేసుకోవడం. కానీ నితిన్ దే మరో సినిమా తమ్ముడు ఆల్రెడీ పండగ మీద కర్చీఫ్ వేసింది. నిర్మాత దిల్ రాజు ముందస్తుగా ఆలోచించి సరైన సీజన్ ని ఎంచుకున్నాడు. ఒకవేళ రాబిన్ హుడ్ కనక శివరాత్రిని కోరుకుంటే తమ్ముడుని వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బాగా ఆలస్యమైన రాజుగారు దానికి ఒప్పుకుంటారా అనేది డౌటే. మైత్రి సంస్థతో ఉన్న పోటీ దృష్యా ఇదంత సులభం కాదు. తక్కువ గ్యాప్ లో తనవే రెండు పెద్ద సినిమాలు రావడం నితిన్ స్వతహాగా ఇష్టపడడు.

సో ఇదంతా తేలేందుకు కొంచెం టైం పట్టేలా ఉంది. అన్ని సవ్యంగా జరిగి ఉంటే తమ్ముడు గత అక్టోబర్ లోనే వచ్చేది. కానీ బడ్జెట్ పెరిగిపోవడంతో పాటు యాక్షన్ ఎపిసోడ్లకు దర్శకుడు వేణు శ్రీరామ్ ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల పోస్ట్ పోన్ తప్పలేదు. ఈ రెండు సినిమాల మీద కలిపి నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. దేనికవి అగ్ర బ్యానర్లు కావడంతో కాంప్రోమైజ్ అయ్యే విషయం అంత ఈజీ కాదు. రాబిన్ హుడ్ కనక రిపబ్లిక్ డేకి ఫిక్స్ అయితే టెన్షన్ ఉండదు. తర్వాత ఫిబ్రవరి మొదటివారంలో తండేల్, రెండో వారంలో లైలా ఆపై కుబేర ఇలా లిస్టు పెద్దదే ఉంది. సో నితిన్ ప్రొడ్యూసర్ల చివరికి ఏం తెలుస్తారో.

This post was last modified on December 17, 2024 12:39 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

28 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

40 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago