రాజమౌళి కలల ప్రాజెక్టు ఏది అంటే మరో ఆలోచన లేకుండా అందరూ మహాభారతం అని చెప్పేస్తారు. దీని గురించి కెరీర్లో ఓ స్థాయి అందుకున్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు జక్కన్న. బాహుబలి టైంలో ఈ మెగా ప్రాజెక్టు చేయడానికి తనకు ఇంకో పదేళ్ల అనుభవం కావాలని చెప్పాడు. ఆ పదేళ్లు గడిచిపోయాయి. మహాభారతం గురించి కొత్త కబురేమీ లేదు. మహేష్ బాబుతో చేయనున్న సినిమా రెండు భాగాలంటున్నారు. అదెప్పటికి పూర్తవుతుందో.. రాజమౌళి మహాభారతం ఎప్పుడు మొదలుపెడతాడో క్లారిటీ లేదు.
కానీ బాలీవుడ్లో మరో లెజెండ్ కూడా మహాభారతాన్ని ఒక మెగా ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నాడు. ఆయనే.. ఆమిర్ ఖాన్. ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కూడా తన టీంతో మహాభారతం మీద కొన్నేళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నాడు. రాజమౌళి మహాభారతాన్ని డ్రీమ్ ప్రాజెక్టు అంటున్నా సరే.. ఆమిర్ తన ప్రయత్నాలేమీ ఆపట్లేదు. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆమిర్. మహాభారతం గురించి ఆమిర్ స్పందిస్తూ.. “నా డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో బాధ్యతతో పాటు భయం కూడా ఉంది.
ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దాలనుకుంటున్నా. ఆ కథ మన భారతీయులుగా రక్తంలోనే ఉంది. కాబట్టి అది నా మీద బాధ్యతను పెంచుతోంది. దీన్ని ఏమాత్రం రాజీ లేకుండా, సరైన పద్ధతిలో రూపొందించాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్టుతో భారతదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా. ప్రతి భారతీయుడూ గర్వించేలా చేయాలనుకుంటున్నా. ఇది జరుగుతుందో లేదో తెలియదు. కానీ నేను మాత్రం దీని మీద పని చేయాలనుకుంటున్నా” అని ఆమిర్ అన్నాడు.
ఇది జరుగుతుందో లేదో అని ఆమిర్ పేర్కొనడంతో అతను ఈ ప్రాజెక్టు చేయడంపై కొంత సందేహాలు కలుగుతున్నాయి. రాజమౌళి ఒకవేళ మహాభారతం ప్రాజెక్టును ప్రకటిస్తే ఆమిర్ వెనక్కి తగ్గే అవకాశముంది. లేదంటే మాత్రం ప్రొసీడ్ కావచ్చు. ఇదిలా ఉండగా గతంలో తాను మూడేళ్లకు ఒక సినిమా చేసేవాడినని.. భవిష్యత్తులో ఏడాదికో సినిమా చేయాలనుకుంటున్నానని ఆమిర్ చెప్పడం విశేషం.
This post was last modified on December 17, 2024 10:33 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…