Movie News

పుష్ప సెన్సేషనల్ రికార్డ్!

‘పుష్ప: ది రూల్’ సినిమా రిలీజై పది రోజులు దాటిపోయింది. ఈ తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వీక్ అయింది కానీ.. నార్త్ ఇండియాలో మాత్రం అదరగొట్టేస్తోంది. అక్కడ తగ్గేదేలే అన్నట్లు కలెక్షన్లలో దూసుకెళ్తోంది. పది రోజుల్లోపే ఐదొందల కోట్ల వసూళ్లతో ‘పుష్ప-2’ హిందీ వెర్షన్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అంతకుముందు అత్యధిక డే-1, వీకెండ్ వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగానూ పుష్ప-2 రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

అంతటితో ఆగకుండా మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోందీ చిత్రం. తాజాగా రెండో వీకెండ్లో వంద కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా ‘పుష్ప-2’ రికార్డు నెలకొల్పడం విశేషం. గత శని, ఆదివారాల్లో కలిపి ఈ చిత్రం హిందీ వరకే రూ.128 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా ఏ హిందీ చిత్రం కూడా రెండో వీకెండ్లో వంద కోట్ల మార్కును కూడా అందుకోలేదు.

ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే వీకెండ్లో విడుదలైన ‘స్త్రీ-’ సినిమా రూ.98 కోట్లతో రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డు ఇప్పుడు ‘పుష్ప-2’ రూ.30 కోట్ల తేడాతో బద్దలు కొట్టడం విశేషం. సమీప భవిష్యత్తులో బాలీవుడ్ సినిమాలు కూడా ఈ రికార్డును అందుకోవడం కష్టమే అనిపిస్తోంది. ‘పుష్ప-2’కు తెలుగులో కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. వసూళ్ల పరంగా కూడా సినిమా పడుతూ లేస్తూ సాగుతోంది. కానీ హిందీలో మాత్రం ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

తొలి రోజు నుంచి వసూళ్ల మోత మోగుతోంది. ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు సాగిపోతోంది. ఒక తెలుగు డబ్బింగ్ సినిమాకు హిందీ ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్.. రెండో వీకెండ్లో కూడా టికెట్ల దొరక్క అభిమానులు ఎగబడుతున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. హిందీలో ఇప్పటికే ఈ చిత్రం రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఫుల్ రన్లో వెయ్యి కోట్ల మార్కును అందుకున్నా కూడా ఆశ్చర్యం లేదన్నది ట్రేడ్ వర్గాల మాట.

This post was last modified on December 16, 2024 6:04 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

31 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago