Movie News

ఫ్యాన్స్ ఫేవరేట్ లుక్ లో తలా దర్శనం!

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్.. మామూలుగా ఒక సినిమా తర్వాత ఇంకోటి చేస్తుంటాడు. కానీ ఆయన చాలా ఏళ్ల తర్వాత ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టి కొంచెం ముందు వెనుకగా పూర్తి చేసేశాడు. సంక్రాంతికి రాబోతున్న ‘విడాముయర్చి’ షూట్ గత నెలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సినిమాను ముగించాక అజిత్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే రెండో సినిమా ముగింపు పనిలో పడిపోయాడు. ఇప్పుడు ఆ చిత్రం కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఆ మూవీనే.. గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కనెక్షన్ ఉండడం విశేషం. ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ అనదగ్గ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. విశాల్‌తో ‘మార్క్ ఆంటోనీ’ లాంటి హిట్ మూవీ చేసిన ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో టాలీవుడ్ నటుడు సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా అజిత్, సునీల్‌‌లతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆధిక్.

ఇందులో అజిత్ లుక్ చూసి అందరూ షాకవుతున్నారు. తన గత చిత్రాల్లో బాగా బరువు పెరిగినట్లు కనిపించిన అజిత్.. ఈ సినిమా కోసం స్లిమ్ లుక్‌లోకి మారిపోయాడు. గడ్డం కూడా తీసేసి లుక్ మార్చాడు. ఈ లుక్ చూస్తుంటే అజిత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంకథ’ గుర్తుకు వస్తోంది. తెలుగులో ‘గ్యాంబ్లర్’ పేరుతో రిలీజైన ఆ చిత్రంలో అజిత్ చాలా స్టైలిష్‌‌గా కనిపించాడు. ఆ లుక్‌నే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో రిపీట్ చేసినట్లున్నాడు.

ఈ లుక్ చూసి తమను 13 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయాడంటూ అజిత్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ‘విడాముయర్చి’ రాకుంటే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు కుదరట్లేదు కాబట్టి ఇక సమ్మర్ రిలీజ్ ఫిక్స్ అనుకోవచ్చు.

This post was last modified on December 15, 2024 6:22 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

19 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

38 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

1 hour ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago