అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఘాటీ రిలీజ్ డేట్ అధికారికంగా చెప్పేశారు. ఏప్రిల్ 18 ప్యాన్ ఇండియా భాషల్లో థియేటర్లలో విడుదలవుతుందని యువి క్రియేషన్స్ చిన్న వీడియో ద్వారా చెప్పేశారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో స్వీటీ ఎప్పుడూ చూడనంత వయొలెంట్ పాత్రలో విశ్వరూపం చూపించనుంది. సరే అభిమానులకు ఇదంతా గుడ్ న్యూసే కానీ ఇక్కడ కొన్ని కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి. ఏప్రిల్ 10 ‘ది రాజా సాబ్’ ఉంది. కేవలం వారం గ్యాప్ తో ప్రభాస్ సినిమా పోటీకు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన యువి అధినేతలు రిస్క్ చేయరు. అంటే డార్లింగ్ వాయిదా వేసుకున్నాడన్న వార్తలు నిజమేనా?
ఒకవేళ రాజా సాబ్ రాకపోతే ‘విశ్వంభర’ వస్తుందనే ప్రచారం గత కొద్దివారాలుగా తిరుగుతోంది. దీని నిర్మాతలు యువినే. సో తమవే రెండు పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వదులుతారని అనుకోలేం. బిజినెస్ పరిమితులు అడ్డుపడతాయి. మార్చి 28 ‘హరిహర వీరమల్లు’ వస్తుంది కనక అదే డేట్ కి ప్లాన్ చేసుకున్న ‘విజయ్ దేవరకొండ 12’ కనక పోస్ట్ పోన్ చేసుకుంటే ఏప్రిల్ లో ఒక స్లాట్ ని ఎంచుకుంటుంది. అప్పుడు పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. ఏప్రిల్ 18 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ‘మిరాయ్’ ఉంది. తేజ సజ్జ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాకి స్కేల్ పరంగా ఏ ప్యాన్ ఇండియా మూవీకి తీసిపోనంత బడ్జెట్ పెడుతున్నారు.
సో ఘాటీ నేరుగా మిరాయ్ తో క్లాష్ అవుతున్న క్లారిటీ వచ్చేసింది. ఆపై ఏప్రిల్ 25 మంచు విష్ణు ‘కన్నప్ప’ని ఆల్రెడీ అఫీషియల్ గా ప్రకటించారు. ఇందులో ప్రభాస్ క్యామియో మీద పెద్ద ఎత్తున మార్కెటింగ్ జరుగనుంది. ఇక్కడ చెప్పినవన్నీ ఖచ్చితంగా మాట మీద ఉంటాయని గ్యారెంటీ లేదు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా మార్పులు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. వీరమల్లు నుంచి పక్కకు వచ్చాక క్రిష్ ప్రత్యేక శ్రద్ధతో ఎక్కువ సమయం తీసుకొని ఘాటీని రూపొందించారు. చాలా గ్యాప్ తర్వాత అనుష్కని సోలో రోల్ లో చూడబోయే మూవీ ఇది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఆమె ఒప్పుకున్న ఒకే ఒక సినిమా ఇదే.
This post was last modified on December 15, 2024 1:23 pm
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చుట్టూ మరో కేసు ముసురుకుంది. ఆయన కొన్నాళ్ల కిందట…
రాజమౌళి, సుకుమార్ తర్వాత ఒక సౌత్ దర్శకుడు బాలీవుడ్ లో బలమైన జెండా పాతింది అంటే అట్లీనే. షారుఖ్ ఖాన్…
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి దూకుడుగా ఉన్న కేంద్ర సర్కారుకు.. కూటమిలో భాగస్వామ్య…
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ.. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి.. చురకలు అంటించారు. ఆయన గత కొన్నాళ్లుగా పనిగంటల విషయంలో ఓ…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజైనప్పటికీ…
అది 1960 ప్రాంతం.. ఓరోజు సాయంత్రం.. "అందరూ తబలా వాయిస్తారు. నువ్వేంటి ప్రత్యేకం"- ఇదీ.. 15 ఏళ్ల వయసులో తన…