ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను టాలీవుడ్ కు చెందిన పలువురు అగ్రహీరోలు, నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అల్లు అర్జున్ కు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
నిన్న అల్లు అరవింద్ కు కూడా చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించిన సంగతి తెలిసిందే. సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆరా తీశారని తెలుస్తోంది. కేసు వివరాల గురించి కూడా అల్లు అర్జున్, అల్లు అరవింద్ లను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారనీ వార్తలు వచ్చాయి కానీ అందులో నిజమెంతో తేలలేదు.
మరోవైపు, అల్లు అర్జున్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం స్వయంగా అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన గంటా..అల్లు అర్జున్ తో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ను మాజీ మంత్రి, వైసీపీ మాజీ నేత అవంతి శ్రీనివాస్ కూడా కలిసి పరామర్శించారు.