ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ స్పిరిట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సీరియస్ గా జరుగుతున్నాయని ముంబై టాక్. ది రాజా సాబ్, ఫౌజీ పూర్తి కాగానే ప్రభాస్ దీని సెట్లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్ ని దాదాపుగా లాక్ చేసినట్టే. ఫైనల్ నెరేషన్ ఒకసారి అయ్యాక షెడ్యూల్స్ వేయబోతున్నారు. టి సిరీస్, భద్రకాళి జంట నిర్మాణంలో రూపొందబోయే ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఇప్పటికిప్పుడు అడ్వాన్సులు తీసుకున్నా వంద కోట్ల పైమాటే వచ్చేలా ఉంది. బాహుబలి హీరో, యానిమల్ డైరెక్టర్ కాంబినేషన్ తో క్రేజ్ మాములుగా ఉండదు కదా.
తాజాగా వస్తున్న లీక్ ఏంటంటే స్పిరిట్ లో డార్లింగ్ కు జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని దాదాపుగా ఓకే చేయొచ్చట. ప్రస్తుతానికి చర్చలు జరిగాయని, సందీప్ వంగా ఓకే అనుకుంటే వెంటనే అగ్రిమెంట్ రాసుకుంటారని తెలిసింది. తొలుత రెండు మూడు పేర్లు వినిపించాయి కానీ కథ ప్రకారం భార్య పాత్ర కాబట్టి తనైతేనే బాగుంటుందని భావించినట్టు సమాచారం. ఇంకోవైపు నిజ జీవిత జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ స్పిరిట్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం దాదాపు ఖరారే. ఆదిపురుష్ లో మిస్ అయిన టార్గెట్ ఈసారి ఖచ్చితంగా తగులుతుందని సైఫ్ నమ్మకంగా ఉన్నాడట.
పవన్ కళ్యాణ్ ఓజి లాగా ఇప్పుడీ స్పిరిట్ అనౌన్స్ మెంట్ స్టేజి నుంచే విపరీతమైన హైప్ తెచ్చేసుకుంది. ఎంతకైనా తెగించే ఒక వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ కథని ఇందులో చూపించబోతున్న క్లూ అయితే సందీప్ ఇచ్చాడు కానీ ట్రీట్ మెంట్ పరంగా ఇప్పటిదాకా ఎవరూ చూడనంత డిఫరెంట్ గా హీరో క్యారెక్టరైజేషన్ ఆశించవచ్చు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే ఒక దఫా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశాడు. ఓ రెండు ట్యూన్స్ ఓకే అయ్యాయట. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రకటన రాకముందే స్పిరిట్ తాలూకు ఏఐ ఇమేజెస్ ఎక్స్ లాంటి మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
This post was last modified on December 14, 2024 5:34 pm
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు జనవరి 14 వతేదీ కళ్ల ముందే కనిపిస్తోంది. ఈ సమయానికి ఆయన పెట్టుకున్న టార్గెట్…
సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి కోర్టు కేసు ఎదురుకుని బెయిల్ మీద బయటికి వచ్చిన అల్లు అర్జున్ నిన్నంతా తన…
అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఘాటీ రిలీజ్ డేట్ అధికారికంగా చెప్పేశారు. ఏప్రిల్ 18 ప్యాన్ ఇండియా భాషల్లో థియేటర్లలో…
గత ఏడాది ఏప్రిల్ లో ఏజెంట్ రిలీజయ్యాక సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న అఖిల్ అభిమానులకు తెరిపినిచ్చాడు. ఇవాళ కొత్త సినిమా…
ఏపీ సీఎం చంద్రబాబు తనకు తానే బిగ్ టాస్క్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర పాలనపైనే దృష్టి పెట్టిన ఆయన…
బాక్సాఫీస్ వద్ద పన్నెండు వందల కోట్ల గ్రాస్ దాటేసి రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉన్న పుష్ప 2 ది…