గడిచిన కొన్ని గంటలు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనోళ్లందరిని అల్లు అర్జున్ అరెస్ట్ గురించే మాట్లాడుకునేలా చేశాయి. పుష్ప 2ని మించిన డ్రామా నిజ జీవితంలో జరగడం చూసి సోషల్ మీడియా మొత్తం దీనివైపే దృష్టి సారించింది. గత కొన్ని నెలలుగా మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయని ఏవేవో ప్రచారాలు జరగడం చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకేచోట కలుసుకునే సందర్భం రాకపోవడం దీన్ని మరింత బలపరిచింది. ఆ మధ్య నాగబాబు వేసిన కొన్ని ట్వీట్లకు విపరీత అర్థాలు తీసి విచిత్ర నిర్వచనాలు ఇచ్చినవాళ్లు లేకపోలేదు.
ఇప్పుడు మొత్తం మారిపోయింది. అల్లుడి అరెస్ట్ విషయం తెలియగానే మెగాస్టార్ విశ్వంభర షూటింగ్ అప్పటికప్పుడు రద్దు చేసుకుని హుటాహుటిన బన్నీ ఇంటికి వచ్చేశారు. నిజానికి పోలీస్ స్టేషన్ కే వెళ్లాలనుకున్నారు కానీ పోలీసులు సెక్యూరిటీ కారణాలు చూపడంతో నిర్ణయం మార్చుకున్నారు. ఏపీలో విజన్ వేడుకలో ఉన్న పవన్ కళ్యాణ్ అది పూర్తి కావడం ఆలస్యం ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ వచ్చే ఏర్పాట్లు వార్తలు వస్తున్నాయి. మరి పవన్ వస్తారో? లేక బెయిలు రావడంతో ఆగిపోతారో తెలియాల్సి ఉంది. కాలు బాలేక ఆరోగ్యం సహకరించకపోయినా నాగబాబు అన్నయ్యతో పాటు బన్నీ ఇంట్లోనే ఉన్నారు. రామ్ చరణ్ ఏ క్షణమైనా అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. సాయి తేజ్, వరుణ్, వైష్ణవ్ అందరూ వెళ్తారు.
ఇదంతా మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం ఒక్కటేననే సంకేతం ఇస్తోందని అభిమానుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కోసం ముందుగా కదిలింది మావయ్యేనని ట్వీట్ చేస్తున్నారు. లాయర్ నిరంజన్ రెడ్డిని రిఫర్ చేసింది కూడా ఆయనేనని ఇన్ సైడ్ టాక్. చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆపద వచ్చినప్పుడు అందరూ ఏకమైపోతామనే సందేశం ఇవాళ రెండు ఫ్యామిలీస్ స్పష్టంగా ఇచ్చేశాయి. రాబోయే రోజుల్లో ఈ ఘటన గురించి ఒక్కొక్కరు స్పందించే వేదిక వేర్వేరుగా అయినా సరే ఖచ్చితంగా వస్తుంది. లేనిపోని ఆన్ లైన్ వార్స్ తో మునిగిపోయే ఫ్యాన్స్ కు ఇవాళ జరిగిన బన్నీ అరెస్ట్ ఉదంతం హ్యాపీగా ముగిసిన ఫ్యామిలీ సినిమాగా అనిపించింది.
This post was last modified on December 13, 2024 7:24 pm
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…