టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ కుటుంబంలో ఆస్తి తగాదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య గొడవలు ముదరడంతో ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ అయింది. ఆ క్రమంలోనే కవరేజికి వెళ్లిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై మోహన్ బాబు దాడి చేయడం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది.
తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆయనను ఏ క్షణంలో అయినా పోలీసులు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో మోహన్ బాబు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే, అదే సమయంలో హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది.
కాగా, టీవీ9 రిపోర్టర్ రంజిత్ తో పాటు టీవీ9 మీడియాకు కూడా మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో అలా జరిగిపోయిందని అన్నారు. కానీ, అప్పటికీ ఆయనపై కేసు నమోదు కావడంతో అరెస్టు తప్పేలా కనిపించడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates