పోలీసుల విచారణకు అల్లు అర్జున్!

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను విచారణ చేసేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువెళ్లారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఎంక్వయిరీ చేసేందుకు అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకువెళ్లారు. ఆ రోజు తొక్కిసలాట సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై గతంలో కేసు నమోదైంది.

ఆ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ ను విచారణ జరిపేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. బన్నీని అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే స్టేషన్ కు తీసుకువెళ్లారని ఆయన పీఆర్ టీం వివరణనిచ్చింది. అభిమానులు కంగారు పడవద్దని తెలిపింది.