గత నాలుగైదు రోజులుగా మీడియాలో హోరెత్తిపోయిన మంచు కుటుంబం గొడవ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ గాయపడటం ద్వారా కొత్త మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆవేశంలో మోహన్ బాబు మైకుతో కొట్టడం వల్ల సదరు జర్నలిస్టు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాపాయం లేకపోయినా సర్జరి అవసరమైన నేపథ్యంలో ఈ ఘటన పట్ల మీడియా సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. విష్ణు నిన్న మాట్లాడుతూ ఆ స్థానంలో మీ తండ్రి ఉన్నా ఇదే చేసేవారని చెప్పడం, జరిగింది వివరించే ప్రయత్నం చేయడం చూశాం. తాజాగా మరో కీలక మలుపు.
అనుకోకుండా జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ మోహన్ బాబు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. గత నలభై ఎనిమిది గంటలుగా ఆసుపత్రిలో ఉండటం వల్ల స్పందించడం ఆలస్యమయ్యిందని, మూకుమ్మడిగా 30 నుంచి 50 మంది తన ఇంటి గేట్లు తోసుకుని లోపలి వచ్చినప్పుడు అందులో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉండటం వల్ల, తోపులాటలో దురదృష్టవశాత్తు విలేఖరి రంజిత్ గాయపడటం జరిగిందని, దీనికి గాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని అందులో పేర్కొన్నారు. పూర్తి వివరణతో మోహన్ బాబు ఇచ్చిన ఈ లేఖతో వివాదం ముగిసినట్టే అనుకోవాలి.
ఇప్పటికే విష్ణు, మనోజ్ లు సిపిని కలిసి ఇకపై ఎలాంటి రాద్ధాంతం జరగదని హామీ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం కూడదంటూ కోర్టు సైతం అభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో ఇక్కడినుంచి ఈ ఇష్యూ మీద తీవ్ర చర్చలు ఉండకపోవచ్చు. మనోజ్ ఆల్రెడీ భైరవం షూటింగ్ లో చేరిపోగా విష్ణు దగ్గరుండి తండ్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆ మీడియా ఛానల్ ఇప్పుడీ పరిణామం పట్ల సానుకూలంగా స్పందించే అవకాశముందని పరిశీలకుల అభిప్రాయం. మొత్తానికి కథ కంచికి చేరినట్టు మంచు ఫ్యామిలీ వివాదం ఎట్టకేలకు పెద్దాయన సారీతో క్లైమాక్స్ కు చేరింది. ఇక జరగాల్సింది శుభమే.
This post was last modified on December 13, 2024 11:09 am
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…