సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు టీజర్ లాంచ్ కార్నేజ్ పేరుతో ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రావడంతో అభిమానులు భారీ ఎత్తున విచ్చేశారు. మెగా పవర్ స్టార్, సుప్రీమ్ హీరో కలయిక కోసం ప్రాంగణాన్ని నింపేశారు. టాలీవుడ్ కు సంబంధించిన పలువురు దర్శకులతో పాటు టీమ్ మొత్తం హాజరయ్యింది. చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ కనిపించే పబ్లిక్ స్టేజి కావడంతో స్వామి స్పీచ్ మీదే అందరి దృష్టి నెలకొంది. మాములుగా కొంచెం పొడిగా మాట్లాడే చరణ్ ఈసారి మంచి చలాకీగా హ్యూమర్ జోడించి మరీ హుషారునిచ్చాడు.
తన మాటల్లో ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం. “ఇవాళ సాయిధరమ్ తేజ్ మన ముందు ఉన్నాడంటే ఆంజనేయస్వామి మీద ఒట్టు అది మీరిచ్చిన ఆశీర్వాదమే. ఇది చెప్పాలా వద్దాని చాలాసార్లు అనుకున్నా కానీ మీ ప్రేమను చూశాక పంచుకోవాలనిపించింది. మీరంతా అభిమానులు కాదు బంగారు అభిమానులు. ఒకటే మాట చెబుతున్నా. సంబరాల ఏటిగట్టులో తేజు ఊచకోత ఎలా ఉండబోతోందో చూస్తారు. దర్శకుడు రోహిత్ కు ముందస్తు శుభాకాంక్షలు. తేజుది బండప్రేమ. పట్టుకుంటే వదలడు. కానీ ఎప్పుడూ మగాళ్ల మీదే చూపిస్తాడు. అమ్మాయిలకు పంచమంటాను. వాళ్ళమ్మ వీడి పెళ్లి గురించే ఆలోచిస్తోంది”
ఇలా సాగింది రామ్ చరణ్ స్పీచ్. మొత్తానికి ఫ్యాన్స్ కోరుకున్నట్టే చరణ్ స్వామి జోష్ ఇచ్చారు. సెప్టెంబర్ 25 విడుదల కాబోతున్న సంబరాల ఏటిగట్టుని హనుమాన్ నిర్మాతలు భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ ఎలిమెంట్ కావడంతో భారీ విఎఫెక్స్ అవసరమవుతోంది. అందుకే రిలీజ్ విషయంలో తొందరపడకుండా పది నెలల తర్వాత ప్లాన్ చేసుకున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో గత సినిమాకు దీనికి గ్యాప్ ఎక్కువ ఉన్నా సరే సాయి ధరమ్ తేజ్ దానికే కట్టుబడ్డాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మైథలాజి థ్రిల్లర్ కు విరూపాక్ష – మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on December 12, 2024 10:02 pm
మొన్నటి ఏడాది నాని హాయ్ నాన్నతో ఎమోషనల్ హిట్టు కొట్టిన దర్శకుడు శౌర్యువ్ కొత్త సినిమా ఎవరితో చేస్తాడనే సస్పెన్స్…
ఈ రోజుల్లో సౌత్ ఇండియన్ సినిమాలన్నీ దాదాపుగా థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఏవో కొన్ని పాన్ ఇండియా…
https://www.youtube.com/watch?v=YH6k5weqwy8 అమీర్ ఖాన్ గంపెడాశలు పెట్టుకున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా నెల రోజులకు…
వైసీపీ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ…
వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల సహనానికి పెద్ద పరీక్ష పెడుతూ వచ్చిన హరిహర వీరమల్లు విడుదల తేదీ వ్యవహారం చివరి…