వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 ఇంకా చాలా దూరంలో ఉంది కానీ బాక్సాఫీస్ పోటీ మాత్రం మహా రంజుగా మారిపోతోంది. నిన్న ‘అఖండ 2 తాండవం’ విడుదల తేదీ ప్రకటించి ఇరవై నాలుగు గంటలు కావడం ఆలస్యం ఇప్పుడు అదే డేట్ కి ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. అంటే బాలకృష్ణ వర్సెస్ సాయి దుర్గ తేజ్ అన్నమాట. అయితే ఈ కాంపిటేషన్ ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే రెండింట్లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి. హిందుత్వం, దైవశక్తి, రాక్షస గణం, అద్భుత లీలలు ఇవన్నీ పుష్కలంగా దట్టించుకున్నాయి. రెండూ రెగ్యులర్ కమర్షియల్ జానర్ కాదు.
సంబరాల ఏటిగట్టుని హనుమాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో భారీ బడ్జెట్ తో తీస్తోంది. రామ్ చరణ్ అతిథిగా లాంచ్ చేసిన ట్రైలర్ చూస్తే ఒక మానవాతీత శక్తిని ఎదురుకోవడానికి సామాన్యుడు చేసే పోరాటం ఎంతటి రక్తపాతానికి దారి తీస్తుందో అనే పాయింట్ మీద రూపొందించినట్టు కనిపిస్తోంది. కథకు సంబంధించిన క్లూస్ ఎక్కువ ఇవ్వలేదు కానీ సిక్స్ ప్యాక్ బాడీతో సాయి ధరమ్ తేజ్ ఫెరోషియస్ గా ఉన్నాడు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంకేతిక వర్గం పనితనం ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. శ్రీకాంత్, సాయికుమార్, జగపతిబాబు వాయిస్ ఓవర్లో నేపథ్యం వినిపించారు.
ఇక అఖండ 2 తాండవం గురించి కొంత తెలిసిందే. మొదటి భాగంలో సెకండాఫ్ కే పరిమితమైన అఘోరా పాత్ర ఈసారి పూర్తి విశ్వరూపం చూపించబోతోంది. తమన్ బీజీఎమ్ మీద అంచనాలు ఆల్రెడీ పీక్స్ లో ఉన్నాయి. దర్శకుడు బోయపాటి శీను మరింత శక్తివంతంగా స్క్రిప్ట్ ని తీర్చిదిద్దినట్టు యూనిట్ టాక్. సో కాంపిటీషన్ మాత్రం మహా రంజుగా ఉండేలా ఉంది. అఖండ 2 తాండవం, సంబరాల ఏటికెట్టు రెండూ సెప్టెంబర్ 25 అని చెప్పాయి కానీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా మాట మీద ఉంటారా అంటే ఏమో చెప్పలేం. ఇంకా పది నెలల సమయముందిగా. చూద్దాం.
This post was last modified on December 12, 2024 9:45 pm
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…