సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా కూలి నుంచి టీజర్ కోసం ఎదురు చూసిన అభిమానులకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఊహించని కానుక ఇచ్చాడు. రజిని హుషారుగా డాన్స్ చేసిన చిన్న వీడియో క్లిప్పుని రిలీజ్ చేసి స్వీట్ షాక్ కొట్టించాడు. మాములుగా తలైవర్ గొప్ప డాన్సర్ కాదు. ఉన్నంతలో చక్కగా చేసి మెప్పించడం ఆయన స్టైల్. వింటేజ్ రజనిని చూపిస్తానని లోకేష్ పలు సందర్భాల్లో అన్న మాటను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. లాల్ సలాం, వెట్టయన్ లో అంతగా మెప్పించలేని లుక్స్ నుంచి మాస్ కి పూర్తిగా కిక్కిచ్చేలా ఒకనాటి మేకోవర్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
ఈ చిన్న సాంగ్ బిట్ వెనుక ఒక విశేషం ఉంది. శింబు తండ్రి, నిన్నటి తరం సీనియర్ నటుడు – దర్శకుడు – మ్యూజిక్ డైరెక్టర్ టిఎన్ రాజేందర్ ఒక ఇంటర్వ్యూలో కంపోజ్ చేసిన చిన్న ట్యూన్ ఆధారంగా ఆయన గొంతునే అనిరుధ్ రవిచందర్ రీ మిక్స్ చేశాడు. ఎప్పుడో పదమూడేళ్ల క్రితం అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలో దీన్ని చూడొచ్చు. ఎలాంటి వాయిద్యాలు లేకపోయినా పాటను ఎలా సృష్టించవచ్చనే దాని మీద రాజేందర్ ఇచ్చిన కంపోజింగ్ ఇది. ఇప్పుడు రజినీకాంత్ కు అతికినట్టు సరిపోయింది. కూలి నుంచి ఏదైనా యాక్షన్ విజువల్స్ ఆశించిన ప్రేక్షకులకు ఇది కూడా మెల్లగా ఎక్కడం ఖాయం.
రజినీకాంత్ – నాగార్జున – ఉపేంద్ర – అమీర్ ఖాన్ – శృతి హాసన్ కలయికలో భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న కూలి కోలీవుడ్ కు మొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందనే ధీమాతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. క్యాస్టింగ్ దృష్ట్యా ఇతర భాషల్లోనూ దీని మీద మాములు క్రేజ్ లేదు. ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది. విక్రమ్, ఖైదీ, మాస్టర్ లను మించి యాక్షన్ ఎలివేషన్లు ఇందులో ఉంటాయని ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరిలో టీజర్ వదిలే ఆలోచన జరుగుతోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో రెండు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు.
This post was last modified on December 12, 2024 7:48 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…