ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో గేమ్ ఛేంజర్ ఆగమనం జరగనుంది. పుష్ప 2 ది రూల్ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న పెద్ద ప్యాన్ ఇండియా మూవీ ఇదే. డిసెంబర్ 21 యుఎస్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు. నిన్న వదిలిన కొత్త ప్రోమోలో గతంలో చూడని విజువల్స్ ఉండటం ఫ్యాన్స్ ని సంతోషపరిచింది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేశారని తెలిసింది. మాములుగా శంకర్ సినిమాలు మూడు గంటలకు దగ్గరగా లేదా అంతకు మించి ఉంటాయి. ఇంత తక్కువ లెన్త్ రామ్ చరణ్ కు ప్లాన్ చేయడమంటే సంథింగ్ స్పెషలనే చెప్పాలి.
సెన్సార్ కాపీ ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ ప్రాధమికంగా శంకర్ లాక్ చేసుకున్న ఫైనల్ ఎడిట్ ఇంతే ఉంటుందట. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అప్పన్న ఫ్లాష్ బ్యాక్ లీకులు తెగ ఊరించేలా ఉన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం గతంలో ఎన్నడూ చూడని రేంజ్ లో ఉంటుందని వినిపిస్తోంది. కాలేజీ స్టూడెంట్, ఐఎఎస్ ఆఫీసర్, రైతు సమస్యల మీద పోరాటం చేసే నాయకుడిగా మూడు షేడ్స్ చూపించబోతున్నారు. తమన్ సంగీతంలో ఇప్పటికే మూడు పాటలు రాగా నాలుగోది అమెరికాలో లాంచవుతుంది.
ఎల్లుండి నుంచి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాబోతున్నట్టు సమాచారం. అందులో భాగంగా బుకింగ్ యాప్స్, వెబ్ సైట్స్ లో పేర్కొన్న నిడివి పైన చెప్పిన దాన్నే నిర్ధారిస్తోంది. శంకర్ ప్రస్తుతం చివరి దశ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు కన్నా ముందే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. రీ రికార్డింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. కొంత భాగానికి అయ్యింది కానీ ఇంకా బ్యాలన్స్ ఉంది. తమన్ దాని కోసమే వెయిట్ చేస్తున్నాడు. తనకు డాకు మహారాజ్ బాధ్యత కూడా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 12న 12 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుంది.
This post was last modified on December 12, 2024 4:15 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…