భారీ అంచనాలను సైతం అధిగమించి ప్రపంచవ్యాప్తం గా వసూళ్ల మోత మోగిస్తోంది ‘పుష్ప: ది రూల్’ సినిమా. ఇప్పటికే ఈ చిత్రం వసూళ్లలో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇంత వేగంగా ఈ మార్కును అందుకున్న సినిమా మరొకటి లేదు. ఐతే హీరో అల్లు అర్జున్ ఇంతటితో సంతృప్తి చెందట్లేదు. ఆల్ టైం రికార్డుల మీదే తన గురి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ‘పుష్ప-2’ను ఇంకొంచెం పుష్ చేస్తే ‘బాహుబలి-2’ పేరిట ఉన్న హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ ఇండియా రికార్డును అందుకుంటుందని అతను ఆశాభావంతో ఉన్నాడు.
అందుకే రిలీజ్ తర్వాత కూడా సినిమాను గట్టిగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు సక్సెస్ మీట్ల పేరుతో ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ కమ్ సక్సెస్ మీట్ నిర్వహించబోతోంది ‘పుష్ప-2’ టీం. దాని తర్వాత బెంగళూరులో కూడా ఒక ఈవెంట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రమోషనల్ ఈవెంట్లు పెద్దగా జరగని రాయలసీమలో ఒక ఈవెంట్ పెడుతున్నారు. ‘పుష్ప-2’ కథ నడిచేది చిత్తూరు జిల్లా నేపథ్యంలో కాబట్టి తిరుపతిలో ఈవెంట్ అనుకుంటున్నారు. ‘పుష్ప’ రిలీజైనపుడు కూడా సక్సెస్ మీట్ అక్కడే జరిగింది. ఇంకో ఈవెంట్ ఆంధ్ర ప్రాంతంలో ఉండొచ్చు. ఇలా రాబోయే రెండు వారాల్లో సినిమాను గట్టిగా ప్రమోట్ చేసి లాంగ్ రన్ ఉండేలా చూడాలని పుష్ప-2 టీం ప్లాన్.
క్రిస్మస్ సెలవులను కూడా ‘పుష్ప-2’ ఉపయోగించుకోవాలనుకుంటోంది. అప్పటికి చాలా సినిమాలు రిలీజవుతున్నప్పటికీ.. తమ చిత్రానికి ఉన్న రీచ్ దృష్ట్యా వసూళ్లు బాగానే ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ‘పుష్ప-2’ హిందీ వెర్షన్ 50 రోజుల దాకా జోరు చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. పది రోజుల తర్వాత టికెట్ల ధరలు కూడా తగ్గుతాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆక్యుపెన్సీలే ఉంటాయని భావిస్తున్నారు.
This post was last modified on December 12, 2024 11:25 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…