సూపర్ స్టార్ రజనీకాంత్ కూలిలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటిస్తుండటం ముందే లీకైన వార్త అయినప్పటికీ తాజాగా జరుగుతున్న షూటింగ్ లో ఇద్దరూ కలుసుకోవడంతో అధికారిక ముద్ర పడిపోయింది. నిజానికీ న్యూస్ ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ సీక్రెట్ గా ఉంచి థియేటర్లో రోలెక్స్ తరహాలో సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. కానీ ఈలోగా లీకులు చక్కర్లు కొట్టేయడంతో వాటిని కట్టడి చేయడం సాధ్యపడలేదు. ఇప్పటికే తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్రలను తీసుకొచ్చి కూలిని మల్టీస్టారర్ చేసిన లోకేష్ ఇప్పుడు ఆమిర్ ఖాన్ తో ఎలాంటి పాత్ర చేయిస్తాడోననే ఆసక్తి విపరీతంగా నెలకొంది.
అయితే రజని, ఆమిర్ కాంబో మొదటిసారి కాదు. ముప్పై సంవత్సరాల క్రితం 1995లో ఆటంక్ హీ ఆటంక్ లో చేశారు. దిలీప్ శంకర్ దర్శకత్వంలో గాడ్ ఫాదర్ స్ఫూర్తితో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. అంచనాలను కనీస స్థాయిలో అందుకోలేక ఫెయిల్యూర్ గా నిలిచింది. తర్వాత పలు ఇంటర్వ్యూలలో ఆమిర్ మాట్లాడుతూ తన నటన తనకే నచ్చలేదని, ఆటంక్ హీ ఆటంక్ చేయకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చాడు. అయిదేళ్ల తర్వాత 2000లో సపోర్టింగ్ ఆర్టిస్టులతో కొంత భాగం రీ షూట్ చేసి తమిళంలో పొన్వన్నన్ గా డబ్బింగ్ చేస్తే అక్కడా ఘోర పరాజయం మూటగట్టుకుంది.
ఇంత ట్రాక్ రికార్డు రజని, అమీర్ కలయికకు ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. అడగాలే కానీ సౌత్ సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లాల్ సింగ్ చద్దా హైదరాబాద్ ప్రమోషన్లలో చెప్పిన ఆమిర్ ఖాన్ అన్నట్టుగానే కూలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కా కపోయినా చాలా కీలకమై దశలో వస్తుందని అంటున్నారు. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లో భాగం కాదు అని స్టాండ్ అలోన్ సినిమా అని లోకేష్ ముందే కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. 2025 వేసవి విడుదలకు రెడీ అవుతున్న కూలి కోలీవుడ్ కు పుష్ప తరహాలో ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కంటెంట్ బాగుంటే అదే జరుగుతుంది.
This post was last modified on December 11, 2024 11:18 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……