Movie News

రాబిన్ హుడ్ ఏం చేయబోతున్నాడు

డిసెంబర్ 25 విడుదల కావాల్సిన రాబిన్ హుడ్ వాయిదా పడిందనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా తిరుగుతోంది. మైత్రి నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా పోస్ట్ పోన్ చేస్తే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. పుష్ప 2 ది రూల్ దూకుడు ఇంకా తగ్గకపోవడం, దుబాయ్ తదితర దేశాల్లో సక్సెస్ మీట్లు ప్లాన్ చేయడం లాంటి కారణాలు రాబిన్ హుడ్ ప్రమోషన్లకు ప్రతిబంధకంగా మారొచ్చని భావిస్తున్నారట. పైగా పుష్ప 2 అగ్రిమెంట్ చేసుకున్న చాలా థియేటర్లు మూడో వారం కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నాయి. టికెట్ రేట్లు సాధారణమవుతాయి కాబట్టి భారీ పికప్ ఉంటుందనే నమ్మకంతో.

రాబిన్ హుడ్ ఒకవేళ క్రిస్మస్ డేట్ మిస్ చేసుకుంటే సంక్రాంతి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కానీ గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంతో తలపడటం అంత సులభం కాదు. ఎంత మైత్రి అయినా సరే క్రేజ్ పరంగా చూసుకుంటే నితిన్ పైన ముగ్గురితో సరితూగలేడు. పోనీ ఇంకా లేట్ గా వద్దామంటే జనవరి చివరికి వెళ్ళిపోవాలి. అందుకే నితిన్ వాయిదా వద్దని వారిస్తున్నట్టు తెలిసింది. ఈ కన్ఫ్యూజన్ లోనే ఐటెం సాంగ్ రిలీజ్ లేట్ అయ్యిందనేది ఒక వెర్షన్. నిజానికి రాబిన్ హుడ్ మీద విపరీతమైన హైప్ లేదు. ఇకపై పెంచాలి. టీజర్ ఫన్నీగా అనిపించింది కానీ బజ్ పెంచేందుకు సరిపోలేదు.

మరి రాబిన్ హుడ్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మైత్రి ఇంకో కోణంలో కూడా ఆలోచించి ఉండొచ్చు. డిసెంబర్ 20, 25 తేదీలలో విపరీతమైన పోటీ ఉంది. అరడజను సినిమాలు తలపడుతున్నాయి. పుష్ప 2 కంటిన్యూటీతో పాటు కొత్త వాటికి స్క్రీన్ల సర్దుబాటు ఎగ్జిబిటర్లకు పెద్ద సవాలే. ఉపేంద్ర యుఐ, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, అల్లరి నరేష్ బచ్చల మల్లికు సపోర్ట్ బాగానే ఉంది. ఈ సమీకరణాలన్నీ చూసుకుంటే రాబిన్ హుడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వాయిదా నిజమైతే మాత్రం ఫ్యాన్స్ అంతా మన మంచికే అనుకోవాలి. లేదంటే క్రిస్మస్ కి సిద్ధమైపోవాలి.

This post was last modified on December 11, 2024 11:02 am

Share

Recent Posts

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

29 minutes ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

1 hour ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

6 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

7 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

9 hours ago