ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తీసినప్పుడు మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే కొనసాగింపు చేయాలన్న రూల్ లేదు. దర్శక రచయితలు తమకు అనుకూలంగా స్క్రీన్ ప్లే ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకుని ప్రేక్షకులను మెప్పించేందుకు ఏం కావాలో అలా రాసుకుంటారు. ఇదే కేరళలోని ఒక థియేటర్ రచ్చకు కారణమయ్యింది. మూడు రోజుల క్రితం డిసెంబర్ ఆరున కేరళలోని సినీపోలీస్ సెంటర్ స్క్వేర్ మాల్ లో ఈవెనింగ్ షోకు ఆడియన్స్ పెద్ద ఎత్తున వచ్చారు. బన్నీకున్న క్రేజ్ దృష్ట్యా దాదాపు హౌస్ ఫుల్ అయిపోయింది. ఇక్కడి దాకా బాగానే ఉంది కదా. అసలు ట్విస్ట్ చూద్దాం.
షో మొదలయ్యాక ఇంటర్వెల్ దగ్గర పడుతున్న టైంలో హఠాత్తుగా ఎండ్ టైటిల్ కార్డ్స్ వచ్చేసాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు. జరిగిందేంటంటే ప్రొజెక్టర్ ఆపరేటర్ తప్పిదం వల్ల ముందు సెకండాఫ్ ప్లే చేశారు. తీరా గంట నలభై నిమిషాల తర్వాత కానీ అసలు విషయం బయటపడలేదు. దీంతో పబ్లిక్ గోల చేయడం జరిగింది. తమ టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ నిరసన ప్రకటించారు. దీంతో యాజమాన్యం పూర్తి సినిమా చూసేందుకు సిద్ధపడ్డ పది మందికి మళ్ళీ ఫస్ట్ హాఫ్ నుంచి షో వేసేందుకు అంగీకరించింది. మిగిలినవాళ్లకు రీ ఫండ్ చేస్తామని హామీ ఇచ్చింది.
లాజికల్ గా చూస్తే సినిమా చూడని వాళ్లకు రెండో సగం నుంచి పుష్ప 2 వేసినా అంత సులభంగా గుర్తు పట్టలేరు. ఇదంతా కథలో భాగమేమో తర్వాత ఫ్లాష్ బ్యాక్ వస్తుందేమో అనుకుంటారు. గతంలో రెండు మూడు చోట్ల ఈ తరహా ఉదంతాలు జరిగాయి కానీ పుష్ప 2 ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయినా గంటన్నరకు పైగా ఆడియన్స్ తాము చూస్తున్నది సెకండాఫ్ అని గుర్తుపట్టలేనంత లీనమయ్యారంటే ఇది కూడా ఒకరకంగా అల్లు అర్జున్, సుకుమార్ మ్యాజిక్ అనుకోవాలి. అంతగా పెర్ఫార్మన్స్, టేకింగ్ తో కట్టిపడేశారు మరి.
This post was last modified on December 9, 2024 4:56 pm
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి జైలు కష్టాలను ఎలాగోలా తప్పించుకున్నా… గుంటూరులోని సీఐడీ…
ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక…
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఎదురైన పాఠాలే.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు భవిష్యత్తు మార్గాలను చూపిస్తున్నాయా? ఆదిశగా…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ ధరలను పెంచుతూ…