తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న సినిమా నిశ్శబ్దం. కానీ ఆ చిత్రం ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ నెల 2న అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన నిశ్శబ్దం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయిన విషయం మాధవన్ పాత్రను సైకోలా చూపించడం. ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకులకు ఎంతమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించలేదు.
ఈ విషయంలో పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా మాధవన్ ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేయగా.. ఒక నెటిజన్ దాని గురించి ప్రస్తావించాడు. సినిమాలో ఆంటోనీ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కన్విన్సింగ్‌గా లేదని, దీనిపై మీరేమంటారని అడిగాడు.
దీనికి మాధవన్ బదులిస్తూ.. ఇప్పుడు నేను కేవలం క్షమాపణ మాత్రమే చెప్పగను అన్నాడు. నిశ్శబ్దం కథ నచ్చి చేశారా, ఈ సినిమాలో నటించాలని నటించారా అని అడిగితే.. కొన్నిసార్లు సినిమాలు ఆడతాయి, కొన్నిసార్లు ఆడవు.. మా వంతు కృషి మేం చేశాం అంటూ నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడు మాధవన్.
నిశ్శబ్దం సినిమా విడుదల కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి రావడం చికాకు పెట్టిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు మాధవన్. తెలుగులో చేస్తున్న డైరెక్ట్ సినిమాల్లో నెగెటివ్ రోల్సే ఎందుకు చేస్తున్నారని అడిగితే.. ప్రస్తుతం తాను ఒప్పుకున్న ఓ తెలుగు సినిమాలో పాజిటివ్ రోల్‌లో చూడబోతున్నారని బదులిచ్చాడతను. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాకెట్రీ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు మాధవన్ చెప్పాడు.
This post was last modified on October 10, 2020 8:54 am
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…