ఇండియన్ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన అమితాబ్ బచ్చన్ ఇప్పటికే రెండు తెలుగు సినిమాల్లో తళుక్కుమన్నారు. ‘మనం’లో క్యామియో తరహా రోల్ చేసిన ఆయన.. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా’లో కీలకమైన పాత్రలోనే కనిపించారు. ఐతే ఆయన చేసిన రెండో పాత్ర మరీ పెద్దదేమీ కాదు. దాన్ని అతిథి పాత్రగానే చెప్పుకోవచ్చు.
ఇప్పుడాయన ప్రభాస్-నాగ్ అశ్విన్‌ల సినిమాలో నటించబోతున్నట్లు అప్‌డేట్ బయటికి వచ్చింది. మరి ఆ పాత్ర నిడివి ఎంత ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అది అతిథి పాత్రా.. లేక స్పెషల్ రోలా అని చర్చించుకుంటున్నారు. ఐతే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చేశాడు. అమితాబ్‌ది ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ అని అతను వెల్లడించాడు. అంతే కాక మరో కీలకమైన విషయాన్ని అతను బయటపెట్టాడు.
ఈ సినిమా స్క్రిప్టు ఫస్ట్ డ్రాఫ్ట్‌లో అనుకున్న వర్కింగ్ టైటిల్.. అమితాబ్ చేయబోయే పాత్ర పేరే అని నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం. ఐతే ఇప్పుడా టైటిల్‌ను కొనసాగిస్తున్నారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. బిగ్-బి పాత్ర పేరునే సినిమా టైటిల్‌గా పెట్టాలన్న ఆలోచన వచ్చిందంటే ఆయనది హీరోతో సమానమైన పాత్రగా భావించవచ్చు.
ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే కూడా భాగమైన సంగతి తెలిసిందే. అమితాబ్ కూడా రావడంతో ఇది ట్రూ పాన్ ఇండియన్ సినిమా అయింది. వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర బడ్జెట్ రూ.400 కోట్లకు పైగానే అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
This post was last modified on October 10, 2020 11:30 am
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…