సీనియర్ దర్శకుడు గుణశేఖర్ చివరి సినిమా ‘రుద్రమదేవి’ విడుదలై సరిగ్గా ఐదేళ్లవుతోంది. ఒక సినిమా మంచి విజయం సాధించాక దాని దర్శకుడు ఇంత గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘రుద్రమదేవి’తో పెద్ద రిస్కే చేసి ఎలాగోలా బయటపడ్డ గుణ.. ఆ తర్వాత కూడా మరో సాహసోపేత ప్రాజెక్టునే నెత్తికెత్తుకున్నాడు. ‘భక్తప్రహ్లాద’ సినిమాలో అత్యంత కీలకమైన హిరణ్యకశ్యపుడి పాత్రనే ప్రధానంగా చేసుకుని ఓ భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి సన్నాహాలు చేశాడు.
ప్రధాన పాత్రకు రానాను ఎంచుకోవడమే కాదు.. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కాల్సిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు సురేష్ బాబును ఒప్పించాడు కూడా. కరోనాకు ముందు అయితే ఈ సినిమా పట్ల సురేష్ బాబు ఆసక్తితోనే కనిపించాడు. ఆర్థిక వనరులు కూడగట్టే ప్రయత్నం కూడా చేశారు.
కానీ కరోనా దెబ్బకు కథ మారిపోయింది. టాలీవుడ్లో పేరుమోసిన ఫైనాన్షియర్లందరూ కూడా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. నిర్మాతలందరికీ కాసుల కటకట మొదలైంది. బడ్జెట్లు తగ్గించుకోక తప్పని పరిస్థితి. భారీ చిత్రాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’ లాంటి రిస్కీ ప్రాజెక్టును ఇప్పుడు తలకెత్తుకోవడం అంటే సాహసమే. అందుకే సురేష్ బాబు ఆ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే అని రుజువు చేస్తూ గుణశేఖర్ తాజాగా ఒక ప్రకటన చేశాడు.
భారీతనంతో కూడుకున్న హిరణ్యకశ్యప చిత్రానికి సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనంతా పూర్తయినప్పటికీ.. కరోనా పరిస్థితుల వల్ల అది పట్టాలెక్కడం ఆలస్యమవుతోందని.. అందుకే దీని కంటే ముందు తాను వేరే సినిమా చేయబోతున్నానని.. దాని గురించి అప్‌డేట్ రాబోతోందని ట్విట్టర్లో ప్రకటించాడు. ‘హిరణ్యకశ్యప’ ఆలస్యం అవుతోందని గుణ అంటున్నప్పటికీ.. అసలు ఆ సినిమా పట్టాలెక్కడమే కష్టం అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.
This post was last modified on October 9, 2020 3:04 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…