థియేటర్లు మూత పడ్డ లాక్ డౌన్ టైంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ చెలరేగిపోయాయి. భారీగా సబ్‌స్క్రిప్షన్లు పెంచుకున్నాయి. కొత్త కంటెంట్‌ను కూడా పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చాయి. కొత్త సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసే సంప్రదాయం గత ఆరు నెలల్లో బాగా ఊపందుకుంది. థియేటర్లు మూత పడ్డ తొలి నాళ్లలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సబ్‌స్క్రిప్షన్లు పెంచుకునేందుకు అమేజాన్ ప్రైమ్ చాలా దూకుడుగా వ్యవహరించింది. నాలుగు నెలల కిందట వరుసబెట్టి అరడజనుకు పైగా సినిమాల డైరెక్ట్ రిలీజ్‌తో ఆశ్చర్యపరిచింది.
పొన్‌మగళ్ వందాల్, పెంగ్విన్, శకుంతలా దేవి, సుజాతయుం సూఫియుం, ఫ్రెంచ్ బిరియాని.. ఇలా వివిధ భాషలకు చెందిన సినిమాలను వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేసింది. దీంతో మిగతా ఓటీటీల్లోనూ వేడి పుట్టి అవి కూడా ఇలా పెద్ద ఎత్తున సినిమాలను కొనడం మొదలుపెట్టాయి. హాట్ స్టార్ సైతం దిల్ బేచారా, సడక్-2, బుజ్, లక్ష్మీబాంబ్ లాంటి పెద్ద సినిమాలను సొంతం చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ నెలలోనే థియేటర్లు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఓటీటీల జోరు కొంచెం తగ్గుతుందని అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా జరుగుతోంది. థియేటర్లు తెరుచుకున్నా ఒకప్పటిలా నడవడానికి కొన్ని నెలలు పడుతుందని అర్థం చేసుకున్న ఓటీటీలు కొత్త సినిమాల కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. అమేజాన్ ప్రైమ్ మరోసారి దండయాత్రను మొదలుపెట్టోబోతోంది. ఆ సంస్థ ఒకేసారి తొమ్మిది కొత్త సినిమాల ఓటీటీ రిలీజ్ గురించి ప్రకటన చేసింది.
ఇందులో సూర్య చిత్రం ‘ఆకాశమే హద్దురా’ కూడా ఒకటి. అది ఆల్రెడీ అక్టోబరు 30న విడుదల ఖరారు చేసుకుంది. ఇది కాక కొత్తగా 8 సినిమాలు అమేజాన్‌లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. వాటిలో ఒక తెలుగు సినిమా కూడా ఉంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ప్రైమ్‌లోనే నవంబరు 20న రిలీజ్ కానుంది. ఇంకా కూలీ నంబర్ వన్, చలాంగ్, దుర్గావతి (హిందీ), మారా (తమిళం), భీమసేన నలమహారాజ, మన్నె నంబర్ 13 (కన్నడ), హలాల్ లవ్ స్టోరీ (మలయాళం) రాబోయే రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
This post was last modified on October 9, 2020 2:59 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…