పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు సంబంధించి సామ్ సిఎస్ పేరు టైటిల్ కార్డులో అడిషినల్ అని వేశారు కానీ ఇటీవలే ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 90 శాతం బిజిఎం తనదేనని చెప్పడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది. విడుదలకు రెండు వారాల నుంచే హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంలోకి తమన్ పేరు రావడం, నేను ఫస్టాఫ్ కు పని చేశానని తను ఒక ఈవెంట్లో చెప్పడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. ఫైనల్ గా దేవి, సామ్ మాత్రమే హైలైట్ అయ్యారు. పాటలు వేర్వేరుగా కంపోజ్ చేస్తే ఎవరు ఏ సాంగ్ అనేది గుర్తుపట్టొచ్చు. కానీ బిజిఎంకు అలా పసిగట్టడం సాధ్యం కాదు.
ఇంతకీ సామ్ సిఎస్ ఏమన్నాడో చూద్దాం. “నేను మాములుగా ఏ సినిమాకైనా పని చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం చదువుతాను. కానీ పుష్ప 2 రేర్ కేసు. అలా కుదరలేదు. ఎందుకంటే ఎడిటింగ్ అయ్యాక నేను చేరాల్సి వచ్చింది. ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో చాలా పని ఒత్తిడి ఉంటుంది. నేను మొత్తం మూవీకి పని చేశాను. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కొంత అలాగే ఉంచినప్పటికీ క్లైమాక్స్ తో సహా 90 శాతం నేను కంపోజ్ చేసిందే. నిర్మాణ సంస్థ త్వరగా పనులు పూర్తి చేసే ఉద్దేశంతో నన్ను తీసుకుంది. ఒక ప్రేక్షకుడిగా నేను ఇందులో భాగమై నా వంతుగా పుష్ప 2కి శాయశక్తులా బెస్ట్ ఇవ్వడానికి కష్టపడ్డాను.”
ఇదంతా సామ్ మాటల సారాంశం. దీనికి దేవి ఎలా స్పందిస్తాడనేది పక్కనపెడితే కిరణ్ అబ్బవరం ‘క’ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సామ్ ఇప్పుడు పుష్ప 2కి వస్తున్న స్పందనలోనూ అంతే భాగం తీసుకుంటాడు. కాకపోతే దర్శకుడు సుకుమార్, నిర్మాతల వైపు నుంచి ఎక్కడా తన గురించి ప్రత్యేక ప్రస్తావన రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ గురించే మాట్లాడారు తప్పించి సామ్ సిఎస్ ఇంత ఎక్కువ పని చేసింది మాత్రం చెప్పలేదు. కారణాలు ఏమైనా ఇన్నేళ్ల తర్వాత సరైన బ్రేక్ అందుకున్న ఈ యువ సంగీత దర్శకుడికి ఇప్పుడు ఆఫర్లు భారీగా వస్తున్నాయి. సోలోగా స్టార్ హీరో ప్రాజెక్ట్ పడితే కెరీర్ సెట్టు.
This post was last modified on December 6, 2024 2:20 pm
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…