Movie News

హరికృష్ణ పోయారు.. అతడి కెరీర్ తలకిందులైంది

‘ప్రేమ ఇష్క్ కాదల్’ లాంటి న్యూ ఏజ్ లవ్ స్టోరీతో దర్శకుడితో తొలి ప్రయత్నంలోనే తనదైన ముద్ర వేశాడు పవన్ సాధినేని. తొలి సినిమా కాబట్టి అతడికి పేరున్న ఆర్టిస్టులు దొరకలేదు. పెద్ద బడ్జెట్ కూడా అందుబాటులో లేదు. ఉన్న పరిమితుల్లోనే అతను ప్రతిభను చాటుకున్నాడు. ఆ సినిమాతో వచ్చిన పేరుతో మంచి స్థాయికి చేరుతాడని అంతా అనుకున్నారు. కానీ అతడి రెండో సినిమా ‘సావిత్రి’ విడుదలకు ముందు మంచి అంచనాలు రేకెత్తించినా.. సినిమాలో అంత విషయం లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది.

ఆ సినిమా వచ్చి నాలుగేళ్ల తర్వాత కానీ పవన్ మరో సినిమా మొదలుపెట్టలేకపోయాడు. అతి కష్టం మీద మరో అవకాశం దక్కించుకున్నాడు కానీ.. అది అరంగేట్ర హీరో అయిన బెల్లంకొండ గణేష్‌తో కావడం గమనార్హం. ఈ సినిమాతో ఏమాత్రం సత్తా చాటుతాడో ఏమో కానీ.. తన రెండో సినిమా తన కెరీర్‌పై చాలా ప్రతికూల ప్రభావం చూపిందని అతనంటున్నాడు.

‘సావిత్రి’ సినిమాను వేరే వాళ్ళతో తీయాలనుకున్నానని.. కానీ వర్కవుట్ కాలేదని.. నారా రోహిత్‌తో తీశానని.. ఒక సినిమా పరాజయం పాలవడానికి అనేక కారణాలు దారి తీస్తాయని.. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగిందని.. ఐతే ఒక సినిమా ఫలితాన్ని బట్టి దర్శకుడిపై ఓ అంచనాకు రావడం కరెక్ట్ కాదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు పవన్.

‘సావిత్రి’ తర్వాత తాను అనుకున్న ఓ పెద్ద ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం కూడా తన కెరీర్ దెబ్బ తినడానికి ఓ కారణమని అతను అభిప్రాయపడ్డాడు. హరికృష్ణ-కళ్యాణ్ రామ్‌ల కలయికలో ఒక ఫాంటసీ మల్టీస్టారర్‌కు కథ రెడీ చేశానని.. అది జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చిందని.. కళ్యాణ్ రామ్ ఎంతో ప్రోత్సహించాడని.. కానీ ఆ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలోనే హరికృష్ణ మరణించడంతో అది క్యాన్సిల్ అయిందని.. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని పవన్ అన్నాడు.

This post was last modified on October 9, 2020 10:44 am

Share

Recent Posts

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

4 minutes ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

35 minutes ago

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

1 hour ago

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

2 hours ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

3 hours ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

4 hours ago