పుష్ప-2 సినిమా రిలీజ్ ముంగిటే ఇందులో ‘పుష్ప-3’కి లీడ్ ఉంటుందనే సమాచారం బయటికి వచ్చేసింది. ఎడిటింగ్ రూం నుంచి ‘పుష్ప-3.. ది రాంపేజ్’ అనే టైటిల్ కనిపిస్తున్న ఒక పిక్ కూడా బయటికి రావడంతో అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. కానీ సినిమాలో మూడో పార్ట్‌కు సరైన లీడ్ ఇవ్వలేదనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమైంది. ‘పుష్ప: ది రూల్’లో కథను మధ్యలో ఆపేశారు. పుష్ప-షెకావత్ మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధం చేశారు. కానీ ‘పుష్ప-2’లో అలా లేదు.
పుష్పకు ఇంటి పేరు వచ్చేయడం.. ప్రధాన శత్రువు పని పట్టేయడంతో పుష్పకు కొత్తగా చెప్పుకోదగ్గ టార్గెట్ కనిపించలేదు. ఎదుగుదల పరంగా అతను ఆల్రెడీ పీక్స్‌కు చేరుకున్నాడు. ఇక కొత్తగా తన జర్నీని ఎలా చూపిస్తారన్నది ప్రశ్న. ఈ ప్రశ్నల మధ్యే పుష్ప-3కి చిన్న లీడ్ ఇచ్చి వదిలేసింది చిత్ర బృందం.ఒక కొత్త విలన్ని తెరపైకి తీసుకొచ్చి అతను పుష్ప ఇంట్లో బాంబు పెట్టి బటన్ నొక్కినట్లు చూపించారు. ఆ వ్యక్తి ముఖం మాత్రం చూపించలేదు. తనెవరన్నది కూడా చెప్పలేదు.
నిజానికి ఈ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేద్దామని అనుకుంది సుకుమార్ టీం. మైత్రీ సంస్థలో హిందీలో ‘జాట్’ మూవీ చేస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్‌ను ఈ పాత్ర కోసం ఎంచుకోవాలనుకున్నారు. సన్నీ తమ చేతిలో ఉన్న హీరోనే కాబట్టి ఆయన్నే పుష్ప-3 విలన్‌గా చూపిద్దామని మైత్రీ అధినేతలు భావించారు. సుకుమార్ కూడా ఒక దశలో ఇందుకు సుముఖంగానే ఉన్నారు. కానీ తర్వాత ఆయన ఆలోచన మారిపోయిందని సమాచారం.
పుష్ప-3 చేస్తామా లేదా అనే విషయంలో తనలో కానీ, హీరో బన్నీలో కానీ క్లారిటీ లేదని.. దాని కోసం కథ కూడా రెడీగా లేదని.. సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదని.. అలాంటపుడు సన్నీని చూపించి ప్రేక్షకులను ఊరించడం, అంచనాలు పెంచడం ఎందుకుని సుకుమార్ అనుకున్నారట. ఒకవేళ సినిమా తీసినా.. అందుకు టైం పడుతుంది కాబట్టి, అప్పటికి అందుబాటులో ఉన్న నటుడిని విలన్ పాత్రకు తీసుకోవడం మంచిదనే అభిప్రాయంతో ఆ పాత్రను షాడోలో చూపించి వదిలేశారని సమాచారం.
This post was last modified on December 6, 2024 11:08 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…