రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రస్తుతం ‘పుష్ప-2’ జాతర నడుస్తోంది. రికార్డు స్థాయిలో రిలీజైన ఈ సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. కానీ హైదరాబాద్‌లో ఐకానిక్ మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్స్‌లో ‘పుష్ప-2’ సందడి లేదు. పెద్ద సినిమాలు రిలీజైనపుడల్లా రౌండ్ ద క్లాక్ షోలు నడిచే ప్రసాద్స్ ఇప్పుడు ‘పుష్ప-2’ సినిమా ఆడక వెలవెలబోతోంది. ఇది ప్రసాద్స్ వాళ్లకు, అలాగే ప్రేక్షకులకు బాధ కలిగించే విషయం.
కొంచెం లేటుగా అయినా ప్రసాద్స్‌లో పుష్ప-2 షోలు పడతాయని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. ఈ రోజు పాత సినిమాలనే నడిపిస్తోంది ప్రసాద్స్. దీంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. రెవెన్యూ షేరింగ్ విషయంలో మైత్రీ అధినేతలతో తలెత్తిన గొడవే ప్రసాద్స్‌లో షోలు పడకపోవడానికి కారణమని తెలిసింది.పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్, ఏషియన్ ఈ సంస్థలన్నీ డిస్ట్రిబ్యూటర్‌కు 55 శాతం ఆదాయాన్ని పంచుతున్నాయి.
అంటే టికెట్ల అమ్మకాల ద్వారా వంద రూపాయలు వస్తే అందులో 45 రూపాయలు థియేటర్‌కు వెళ్తాయి. 55 రూపాయలు డిస్ట్రిబ్యూటర్‌కు వెళ్తాయి. ఐతే ప్రసాద్స్ ఎప్పట్నుంచో నార్మల్ స్క్రీన్స్ నుంచి 52.5 శాతం, బిగ్ స్క్రీన్ నుంచి 50 శాతం డిస్ట్రిబ్యూటర్‌కు ఇస్తోంది. మిగతా మల్టీప్లెక్సులతో పోలిస్తే ఇక్కడ స్నాక్స్ సహా అన్నీ తక్కువ ధరకు లభిస్తాయి. సిటీ మధ్యలో సినీ గోయర్స్‌ను బాగా ఆకర్షించే మల్టీప్లెక్స్ ఇది. ఇండస్ట్రీ వాళ్లతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారు. చాలా వరకు సినిమాల ఫస్ట్ షోలు ఇక్కడే పడుతుంటాయి. ప్రిమియర్స్, ప్రెస్ షోలకు కూడా ఇదే వేదిక.
ఐతే ‘పుష్ప-2’ను నైజాంలో సొంతంగా రిలీజ్ చేసిన ‘మైత్రీ’ అధినేతలు మిగతా మల్టీప్లెక్సుల్లాగే 55 శాతం రెవెన్యూ ఇవ్వాలని పట్టుబట్టారు. ఐతే ఈ ఒక్క సినిమాకు ఒప్పుకుంటే తర్వాత కూడా అన్ని చిత్రాలకూ అదే రెవెన్యూ షేరింగ్ మోడల్ కొనసాగించాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో ప్రసాద్స్ యాజమాన్యం ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో పీటముడి బిగుసుకుని సమస్య ఎంతకీ పరిష్కారం కాలేదు. ఇరు వర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో ప్రసాద్స్‌లో ‘పుష్ప-2’ షోలు పడలేదు.
This post was last modified on December 5, 2024 8:57 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…